ఈ సంక్రాంతికి “హను మాన్” రికార్డు బ్రేక్ అవుతుందా

ఈ సంక్రాంతికి “హను మాన్” రికార్డు బ్రేక్ అవుతుందా

Published on Jan 9, 2025 1:00 PM IST

మన టాలీవుడ్ సినిమా దగ్గర సంక్రాంతి పండుగ సినిమాల పరంగా ఎప్పుడూ మంచి రసవత్తరంగానే ఉంటుంది అని చెప్పాలి. అలా గత ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చెయ్యగా ఈసారి సంక్రాంతికి కూడా పలు సాలిడ్ సినిమాలు రిలీజ్ కి వస్తున్నాయి. ఇక ఈ చిత్రాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ అలాగే నట సింహం బాలయ్య నటించిన భారీ సినిమా డాకు మహారాజ్ అలాగే వెంకీ మామ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఉన్నాయి.

అయితే ఇప్పుడు వరకు మన టాలీవుడ్ దగ్గర సంక్రాంతి బరిలో వచ్చిన సినిమాల్లో ఆల్ టైం రికార్డు వసూళ్ళని చిన్న సినిమాగా వచ్చినప్పటికీ గత ఏడాది “హను మాన్” అందుకుంది. యంగ్ హీరో తేజ సజ్జ అలాగే ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేసింది.

దీనితో హను మాన్ సెట్ చేసిన రికార్డు ఇపుడు బ్రేక్ అవుతుందో లేదో చూడాలి. ఇప్పుడు వరకు వచ్చిన సంక్రాంతి సినిమాల్లో హను మాన్ ఒకటే 300 కోట్లకు పైగా గ్రాస్ ని దాటి వసూలు చేసింది. అలాగే షేర్ పరంగా కూడా సంక్రాంతి బరిలో హను మాన్ దే పై చేయి. మరి ఈసారి వస్తున్న సినిమాలు ఈ రికార్డుని బ్రేక్ చేస్తాయో లేదో చూడాలి. ఎక్కువగా గేమ్ ఛేంజర్ కి ఈ ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు