మన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా ఓ మీటింగ్ లో సనాతన ధర్మం విషయంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లో నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే ఇదే మీటింగ్ లో మన పక్క స్టేట్ తమిళనాడుకి చెందిన ప్రముఖ హీరో అలాగే పవన్ లానే అక్కడ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ విషయంలో చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.
తనకి తమిళ్ లోనే పవన్ వార్నింగ్ ఇవ్వగా అటు హీరోలుగా డిప్యూటీ సీఎంలుగా ఇలాంటిది ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. మరి పవన్ తన సైడ్ నుంచి ఉదయనిధికి సాలిడ్ కౌంటర్ ఇచ్చారు. మరి దీనిపై ఉదయనిధి ఏమన్నా కౌంటర్ ఇస్తాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఒకవేళ ఇస్తే ఇది ఎక్కడ ఆవరకు వెళుతుంది అనేది కూడా సోషల్ మీడియా ప్రజానీకంలో మరింత ఇంట్రెస్టింగ్ అంశంగా మారింది. మరి పవన్ విషయంలో కోలీవుడ్ హీరో ఏమంటాడో చూడాలి.