‘క్రాక్’తోనైనా హీరోయిన్ గా బిజీ అవుతుందా ?

Published on Jun 30, 2020 12:59 am IST


సినీ పరిశ్రమలో అదృష్టం అనే ఒక్క ఐటమ్ లేకపోతే అవకాశాలు రావంటారు. వచ్చినా స్థాయికి తగ్గట్లు రావంటారు. ఇలాంటి కోవకే చెందుతుంది ‘వరలక్ష్మీ శరత్‌కుమార్‌’. ఒక హీరోకి కూతురు అయినా, పైగా హీరోయిన్ కు ఉండాల్సిన క్యాలిటీస్ అన్ని ఉన్నా ఎందుకో హీరోయిన్ గా మాత్రం వరలక్ష్మి బిజీ కాలేకపోతుందనేది వాస్తవం. ఇన్నాళ్లూ ఎక్కువుగా చిన్న చిత్రాలకు అలాగే సేడ్ క్యారెక్టర్స్ కే పరిమితం అవుతూ వచ్చింది వరలక్ష్మి.

అయితే వరలక్ష్మికి మాస్‌ మహారాజా సినిమా క్రాక్ లో ఓ మంచి అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. ర‌వితేజ – గోపీచంద్ మ‌లినేని కలయికలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. అయితే వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కూడా రవితేజ సరసన మరో హీరోయిన్ గా ఆడిపాడనుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో వరలక్ష్మి పాత్రనే హైలైట్ అవ్వనుందని తెలుస్తోంది. మరి ‘వరలక్ష్మీ శరత్‌కుమార్‌’ ఈ చిత్రంతోనైనా రెగ్యులర్ హీరోయిన్ గా బిజీ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More