వర్మ డబ్బులు వెనక్కి ఇస్తాడా ?, జైలుకు వెళ్తాడా ?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటేనే.. వివాదానికి కేంద్ర బిందువు. తన గురించి ఎవరు ఏమనుకుంటారో ?, తన పోస్ట్ ల పై ఎదుటి వ్యక్తులు ఎలా ఫీల్ అవుతారో ? లాంటి వాటి గురించి వర్మ అస్సలు ఆలోచించడు. వర్మ అంటేనే కాంట్రవర్సీ. అయితే, అలాంటి వర్మకు ప్రస్తుతం కష్టకాలంలా ఉంది. ఏపీ ప్రభుత్వం వర్మ చేసిన తప్పులను వదిలేలా లేదు. ఈ నేపథ్యంలోనే వ్యూహం, శపథం సినిమాల విషయంలో రూ. కోటి పదిహనేను లక్షల రూపాయలను.. పన్నెండు శాతం వడ్డీతో పదిహేను రోజుల్లో చెల్లించాలని ఏపీ ప్రభుత్వం ఆర్జీవీకి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ రూ. కోటి పదిహనేను లక్షల రూపాయలను వ్యూహం సినిమా ఫైబర్ నెట్‌లో ప్రసారానికి ఇచ్చి వ్యూస్ ప్రకారం తీసుకున్న డబ్బులు. ఐతే, చెందాల్సిన డబ్బు కంటే చాలా అధిక మొత్తంలో వర్మకు డబ్బులు వెళ్లాయి. పైగా నేరుగా వర్మ ఖాతాలోకి జమ అయ్యాయి. మరి పదిహేను రోజుల్లోపు తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇవ్వకపోతే వర్మ పై కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఈ కేసు విషయంలో వర్మ అడ్డంగా బుక్ అయినట్టే. మరి వర్మ డబ్బులు వెనక్కి ఇస్తాడా ?, జైలుకు వెళ్తాడా ? అనేది చూడాలి.

Exit mobile version