‘వార్ 2’ టైటిల్ రూమర్స్ పై క్లారిటీ

‘దేవ‌ర‌’ హ‌డావుడి తగ్గడంతో ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు ‘వార్ 2’పై ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోష‌న్‌ కూడా ఈ సినిమాలో మరో హీరో కావడం, పైగా భారీ పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమా పై రోజురోజుకు అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ‘వార్ 2’ గురించి ఓ సరికొత్త వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాకు తెలుగులో ఓ కొత్త టైటిల్ నిర్ణ‌యించే అవ‌కాశాలు ఉన్న‌ట్టు ఆ వార్తల సారాంశం.

‘యుద్ధ‌భూమి’ అనే టైటిల్ ను ‘వార్ 2’ కోసం రిజిస్ట‌ర్ చేయించార‌ని తెలుస్తోంది. ఐతే, ‘యుద్ద‌భూమి’ అనేది కొత్త టైటిల్ కాదు, గ‌తంలో ఇదే టైటిల్ తో మెగాస్టార్ హీరోగా ఓ సినిమా వచ్చింది. అసలు ఒకే టైటిల్ ఉంటే, అన్ని భాష‌ల్లోనూ త్వ‌ర‌గా రీచ్ అవుతుంది. మరి ఇలాంటి నేపథ్యంలో ‘వార్ 2’ కోసం తెలుగులో వేరే టైటిల్ పెడ‌తారని వార్తలు వచ్చాయి. అయితే, ‘వార్ 2’ తెలుగు టైటిల్ విషయంలో వస్తున్న వార్తలు కేవలం గాసిప్స్ మాత్రమే. తెలుగులో ‘వార్ 2’ టైటిల్ ను మార్చడం లేదు.

Exit mobile version