వన్ మ్యాన్ ఆర్మీ..చిరు గారికి జన్మదిన శుభాకాంక్షలు.!

ఎంతటి మహా వృక్షం అయినా సరే “ఒక్క” చిన్న విత్తు నుంచే మొదలు అవుతుంది. అలాంటి మహా వృక్షమే తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఒక్కడిగా మొదలై ఒక్కడిగా సాగి దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగు పరిశ్రమలో అదే ఒకటి స్థానంలో మకుటం లేని మహారాజుగా నిలిచి కోట్లాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఆ ఒక్కడు చిరంజీవిలా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి.

ఒక దిశగా పరుగులు తీస్తున్న తెలుగు సినీ పరిశ్రమకు తన నృత్యంతో కొత్త దారి చూపించి తన కంటూ ఒక ట్రెండ్ సెట్ చేసుకొని ఎందరికో యువ నటులకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ఒక్క నటునిగా వెండితెర మీద మెప్పించడమే కాకుండా నిజ జీవితంలో కూడా ఎందరికో సాయం చేసి ఇతరులకు కూడా పక్కవారికి సాయం చెయ్యాలని స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

ఎన్నో ఆల్ టైం రికార్డులు, రివార్డులు, అవార్డులు అందుకొని దాదాపు దశాబ్దం పాటు గ్యాప్ వచ్చినా తన బాక్సాఫీస్ స్టామినాలో ఎలాంటి మార్పు లేదని నేటి తరం హీరోలకు కూడా తన దమ్మేంటో రుచి చూపించడం మామూలు విషయం కాదు. అందుకే ఆయన “వన్ మ్యాన్ ఆర్మీ” అయ్యారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని 123తెలుగు టీం తరపున ఆకాంక్షిస్తున్నాం.

Exit mobile version