బుల్లితెర హిట్ షో “జబర్దస్త్” లో తన టాలెంట్ తో సత్తా చాటి బుల్లితెర కమల్ హాసన్ గా పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను హీరోగా డెబ్యూ ఇస్తూ చేస్తున్న లేటెస్ట్ చిత్రమే “రాజు యాదవ్”. కొన్ని నిజ జీవిత సంఘటనలు ఆధారంగా దర్శకుడు కృష్ణమాచారి తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్ ని అయితే రిలీజ్ చేశారు.
యంగ్ హీరో గెటప్ శ్రీను సహా నటుడు “హను మాన్” (Hanu Man Teja Sajja), “జాంబీ రెడ్డి” హీరో తేజ సజ్జ చేతులు మీదగా రిలీజ్ చేసిన ట్రైలర్ మెప్పించే విధంగా ఉందని చెప్పాలి. మంచి ఫన్ మరియు ఆకట్టుకునే ఎమోషన్స్ ఇందులో కనిపిస్తున్నాయి. తన నోటికి తగిలిన గాయం మూలాన తన లైఫ్ ఎలా మారుతుంది.
ఏ ఎమోషన్ లో అయినా కూడా నవ్వుతూ ఉన్న ముఖం మూలాన ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది ఓ నటుడుగా గెటప్ శ్రీను అద్భుతంగా పండించాడు. అలాగే తన ప్రేమకథతనకున్న , తనకున్న సమస్యని తీర్చుకోడానికి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు చివరికి ఏమయ్యింది అనే అంశాలతో ట్రైలర్ చూసేందుకు ఇంప్రెసివ్ గా ఉంది.
అలాగే ఈ చిత్రానికి సంగీతం హర్ష వర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నాడు, అలాగే సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం అందించాడు. మరి వీరి వర్క్ కూడా ట్రైలర్ బాగుంది. మరి ఈ మే 17న వచ్చే ఈ చిత్రం ఆకట్టుకునేలా అనిపిస్తుంది. మరి చూడాలి గెటప్ శ్రీను ఎలాంటి స్పందన అందుకుంటాడో అనేది. ఇక ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి నిర్మాణం వహించారు.