“జైలర్ 2”..మళ్లీ అతడే హైలైట్!

“జైలర్ 2”..మళ్లీ అతడే హైలైట్!

Published on Jan 15, 2025 8:05 AM IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చిత్రాల్లో సెన్సేషనల్ హిట్ సినిమా “జైలర్” కూడా ఒకటి. గత 2023లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం తమిళ్ సహా తెలుగులో కూడా భారీ వసూళ్లు సాధించి అదరగొట్టింది. అయితే అయితే ఈ సినిమాకి సీక్వెల్ కోసం ఎప్పుడు నుంచో అభిమానులు ఎదురు చూస్తుండగా లేటెస్ట్ గా పండుగ కానుకగా అయితే ఈ బ్లాస్టింగ్ అప్డేట్ ని మేకర్స్ ఇచ్చేసారు.

అయితే ఈ సినిమా అనౌన్సమెంట్ టీజర్ తోనే హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. అయితే ఇందులో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ విజన్ తో పాటుగా తలైవర్ గాడ్ లెవెల్ ప్రెజెన్స్ ఓ రేంజ్ లో హైలైట్ అయితే వీటికి మించి మళ్లీ సంగీత దర్శకుడు అనిరుద్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ ని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లుపోయింది. దీనితో ఈ స్కోర్ కోసం అనిరుద్ కోసం అప్పుడు జైలర్ సమయంలో ఎంత టాపిక్ గా నిలిచిందో మళ్లీ అంతే రేంజ్ లో అనిరుద్ వర్క్ కోసం వినిపిస్తోంది. మొత్తానికి మళ్లీ అనిరుద్ తాండవం వైరల్ అవుతుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు