Hyper Aadi: కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే నేను కూడా విరాళం అందించా – హైపర్ ఆది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో సహా నేషనల్ వైడ్ గా కూడా సినిమాలు కాకుండా ఎలాంటి రీచ్ ని సొంతం చేసుకున్నారో తెలిసిందే. సినీ హీరో గానే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవిలో పవన్ తనదైన శైలిలో తన పనులు తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలు వచ్చిన సంగతి తెలిసిందే.

దీనితో పవన్ కళ్యాణ్ మొత్తం 6 కోట్ల విరాళాన్ని తన వైపు నుంచి ప్రకటించారు. అయితే ఈ క్రమంలో మరింతమంది ప్రముఖులు కూడా తమ వంతు విరాళాలు అందజేయగా పవన్ అభిమాని అలాగే ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది కూడా తన వంతుగా 3 లక్షల రూపాయలు విరాళాన్ని అందించాడు. అయితే దీనిపై హైపర్ ఆది పవన్ కళ్యాణ్ గారు వరదల్లో అతలాకుతలం అయ్యిన పరిస్థితుల్లో 6 కోట్లు ప్రకటించి అందరిలో స్ఫూర్తిని నింపారు.

నేరుగా పంచాయతీలకు విరాళం ఇవ్వొచ్చని తెలిసి నా వంతుగా 3 లక్షలు (1 లక్ష పిఠాపురంలోని ఏకే మల్లవరం గ్రామానికి మరో 2 లక్షలు తన స్వగ్రామం పల్లామల్లి) కి అందిస్తున్నట్టుగా హైపర్ ఆది పవన్ కలిసి చెక్ ని అందజేయడం జరిగింది. దీనితో పవన్ కూడా ధన్యవాదాలు తెలిపిన సంగతి తెలిసిందే.

Exit mobile version