“పుష్ప” ముందు తనదే భారీ టార్గెట్..బన్నీ బ్రేక్ చేస్తాడా?

“పుష్ప” ముందు తనదే భారీ టార్గెట్..బన్నీ బ్రేక్ చేస్తాడా?

Published on Mar 13, 2022 3:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ సినిమా “పుష్ప ది రైజ్”. బన్నీ మరియు దర్శకుడు సుకుమార్ ల నుంచి వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో ముందు నుంచి స్పెషల్ అంచనాలు ఈ చిత్రంపై ఉన్నాయి. పైగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తో కూడా కావడంతో ఈ ట్రయో పై ఉన్న క్రేజ్ అంచనాలకి తగ్గట్టుగా అన్నీ రీచ్ అయ్యి అదరగొట్టింది.

ఇక బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అయ్యిన ఈ చిత్రం ఇప్పుడు టెలివిజన్ పైకి రాబోతుంది. అయితే ఇక్కడ కూడా బన్నీ ముందు భారీ టార్గెట్ అందులోని తనదే ఉందని చెప్పాలి. తన ముందు సినిమా “అల వైకుంఠపురములో” సినిమా పేరిట 29.4 ఆల్ టైం టీఆర్పీ రికార్డు ఉంది. ఇప్పటికీ కూడా ఇది అన్ బ్రేకబుల్ గా ఉంది.

మరి ఇపుడు ఫైనల్ గా మళ్ళీ తన భారీ హిట్ అయినటువంటి “పుష్ప” చిత్రం ఈరోజు స్టార్ మా లో సాయంత్రం 6 గంటలకి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అవుతుంది. ఆల్రెడీ బన్నీ సినిమాలకి మంచి ఆదరణ బుల్లితెరపై కూడా ఉంది. మరి ఈ సినిమాతో మళ్ళీ తన రికార్డు ను తానే బ్రేక్ చేసుకుంటాడో లేదో ఆసక్తిగా మారింది. మరి చూడాలి బన్నీ తన రికార్డు తనే బ్రేక్ చేస్తాడో లేదో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు