వరల్డ్ ఆఫ్ యుఫోరియా గ్లింప్స్.. గుణశేఖర్ నుండి వస్తున్న రా కాన్సెప్ట్

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ నుండి సినిమా వచ్చి ఏడాది దాటింది. ఆయన తెరకెక్కించే సినిమాలు గ్రాండ్ స్కేల్‌లో ఉండటంతో వాటి కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అయితే, ఈసారి గుణశేఖర్ తన పంథా మార్చి ఓ వినూత్న ప్రయత్నం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే ఆయన ‘యుఫోరియా’ అనే సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తవగా, 40 శాతం మిగిలి ఉంది. ఈ చిత్ర టైటిల్‌ని మాత్రమే అనౌన్స్ చేసిన గుణశేఖర్, అటుపై ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌గా కాలభైరవ పేరును కూడా ప్రకటించాడు. అయితే, తాజాగా ఈ యుఫోరియా సినిమా ప్రపంచాన్ని మనకు పరిచయం చేశారు మేకర్స్.

‘వరల్డ్ ఆప్ యుఫోరియా’ అంటూ వచ్చిన ఈ మూవీ గ్లింప్స్ వీడియో చాలా రా ఎమోషన్స్‌తో సాగింది. ఈ సినిమా నేపథ్యం డ్రగ్స్ చుట్టూ సాగుతుందని ఈ గ్లింప్స్ వీడియో చూస్తే అర్థమవుతోంది. డ్రగ్స్‌కు బానిసలై యువత ఎలాంటి ఇబ్బందుల్లో పడతారనేది మనకు ఈ సినిమాలో చూపెట్టనున్నారు. ఇక ఈ సినిమాలో కొత్తవారితో పాటు పలువురు సీనియర్ యాక్టర్స్ కూడా నటిస్తున్నారు. భూమిక చావ్లా, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నీలిమ గుణశేఖర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 ప్రథమార్థంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

గ్లింప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version