వరల్డ్ వైడ్ “డాకు మహారాజ్” 3 రోజుల వసూళ్లు ఎంతంటే!

వరల్డ్ వైడ్ “డాకు మహారాజ్” 3 రోజుల వసూళ్లు ఎంతంటే!

Published on Jan 15, 2025 5:05 PM IST

నందమూరి నటసింహం ఇపుడు టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “డాకు మహారాజ్”. దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై మొదటి నుంచి కూడా మంచి అంచనాలు నెలకొనగా రిలీజ్ అయ్యాక వాటిని అందుకునే రేంజ్ టాక్ సహా బాలయ్య కెరీర్ లో రికార్డు ఓపెనింగ్స్ ని ఈ చిత్రం అందుకుంది.

ఇలా మొత్తం మూడు రోజుల రన్ ని ఈ చిత్రం పూర్తి చేసుకోగా ఈ మూడు రోజులో భారీ నంబర్స్ ని డాకు మహారాజ్ అందుకోవడం జరిగింది. అయితే మేకర్స్ చెబుతున్న అఫీషియల్ నెంబర్ ప్రకారం డాకు మహారాజ్ కేవలం మూడు రోజుల్లోనే 92 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకొని నాలుగో రోజు వసూళ్లతో 100 కోట్ల క్లబ్ లోకి చేరబోతోంది. దీనితో బాలయ్య కెరీర్ లో మరో 100 కోట్ల సినిమాగా ఇది నిలవనుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా అలాగే శ్రద్దా శ్రీనాథ్ తదితరులు నటించగా థమన్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు