గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ సాలిడ్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం అటు రామ్ చరణ్ అలాగే ఇటు శంకర్ కెరీర్ లో 15వ సినిమాగా అలాగే దిల్ రాజు బ్యానర్ లో 50వ సినిమాగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కించి తీసుకొచ్చారు.
మరి ఇలా కొంచెం ఆలస్యంగా సరైన ప్రమోషన్స్ లేకుండానే వచ్చిన ఈ చిత్రం బుకింగ్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లో లేట్ గానే మొదలయ్యాయి. అయితే ఇపుడు ఫైనల్ గా రిలీజ్ అయ్యిన ఈ సినిమా ట్రెండ్ మాత్రం సాలిడ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా డే 1 కి వరల్డ్ వైడ్ గేమ్ ఛేంజర్ భారీ ఓపెనింగ్స్ అందుకోవడం ఖాయం అని కన్ఫర్మ్ అయ్యింది.
అయితే పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసిన ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మంచి బుకింగ్స్ కనిపిస్తున్నాయి. అలాగే యూఎస్ మార్కెట్ లో కూడా 1 మిలియన్ మేర ప్రీమియర్స్ పడ్డట్టు కూడా టాక్ ఉంది. దీనితో వరల్డ్ వైడ్ గా మొదటి రోజు ఈజీగా 100 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసి 120 నుంచి 150 కోట్ల మేర అందుకోవచ్చని ట్రేడ్ లో ప్రిడిక్షన్ నడుస్తుంది. మరి మేకర్స్ నుంచి అఫీషియల్ గా ఎంత వస్తుందో చూడాలి.