‘జాట్’ వరల్డ్ వైడ్ 2 రోజుల వసూళ్లు..!

బాలీవుడ్ మాస్ స్టార్ నటుడు సన్నీ డియోల్ హీరోగా మన తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన సాలిడ్ మాస్ మసాలా యాక్షన్ చిత్రం “జాట్”. అయితే డీసెంట్ బజ్ నడుమ థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం అంతే డీసెంట్ ఓపెనింగ్స్ ని మొదటి రోజు వరల్డ్ వైడ్ అందుకుంది. ఇక రెండు రోజులు రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఈ 2 డే కి కూడా స్ట్రాంగ్ వసూళ్లు కొనసాగించింది అని చెప్పవచ్చు.

మొదటి రోజుకు 10 కోట్లకి పైగా నెట్ వసూళ్లు వరల్డ్ వైడ్ అందుకోగా డే 2 కూడా మరో 10 కోట్ల మేర వసూళ్లు సాధించింది. దీనితో రెండో రోజుల్లో జాట్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 20.1 కోట్ల గ్లోబల్ వసూళ్లు ని అందుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక వీకెండ్ లో కూడా సాలిడ్ జంప్ ఉంటుంది అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి ఈ సినిమా వీకెండ్ కి ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఇక చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

Exit mobile version