వరల్డ్ వైడ్ దుమ్ము లేపిన “కల్కి” డే 1 వసూళ్లు.!

వరల్డ్ వైడ్ దుమ్ము లేపిన “కల్కి” డే 1 వసూళ్లు.!

Published on Jun 28, 2024 3:43 PM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పడుకోణ్ అలాగే దిశా పటాని ఫీమేల్ లీడ్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం సెన్సేషనల్ బుకింగ్స్ ని ముందే నమోదు చేయగా డే 1 కి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం డెఫినెట్ గా రికార్డు గ్రాస్ కొల్లగొడుతుంది అని ముందే ఊహించాం. మరి అనుకున్నట్టుగానే ఈ చిత్రానికి రికార్డు ఓపెనింగ్స్ నమోదు అయ్యింది.

మరి మేకర్స్ ఇచ్చిన అఫీషియల్ పి ఆర్ నెంబర్ ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 191.5 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టి ఇండియా లోనే మూడో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా ఇది నిలిచింది. అంతే కాకుండా ప్రభాస్ కెరీర్ లో కూడా ఇది లాస్ట్ టైం సలార్ 170 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుంది. ఇప్పుడు దీనిని క్రాస్ చేసి బాహుబలి 2 తర్వాత ప్రభాస్ రెండో బిగ్గెస్ట్ ఓపెనర్ గా ఇది నిలిచి సెన్సేషన్ ని సెట్ చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు