తిరుమల : అక్టోబర్ : 20
శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రధాన వాహనం గరుడుడు. అందుకే గరుడుడిని ‘పెరియ తిరువాడి’ (ప్రధాన భక్తుడు, ప్రథమ భక్తుడు) అంటారు. బ్రహ్మోత్సవాలలో మాత్రమే కాకుండా ప్రతీ నెలా వచ్చే పొర్ణమినాటి రాత్రి జరిగే గరుడ వాహన సేవకు ఒక ప్రత్యేకత ఉంది. ధ్రువబేరానికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాలలను గరుడవాహన సేవ రోజున మాత్రం ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామికి అలంకరిస్తారు.
నాలుగు మాడ వీధుల్లో భక్తుల పరవశం మధ్య ఈ సాయంకాలం జరిగిన గరుడ సేవా వైభవోత్సవంలో టి.టి.డి. చైర్మన్ సుబ్బారెడ్డి దంపతులు, ఈ.ఓ జవహర్ రెడ్డి దంపతులతో పాటు, పెద్ద జియ్యంగార్, ప్రధాన అర్చకులు, మహా పండితులు ఆకెళ్ళ విభీషణ శర్మ, కుప్పా వెంకట శివ సుబ్రహ్మణ్య అవధాని తో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక భావజాల పరీవ్యాప్త మహోన్నత సంస్థ జ్ఞాన మహా యజ్ఞ కేంద్రం సంస్థాపకులు , ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధికారిక మాసపత్రిక ‘ ఆరాధన ‘ పూర్వ సంపాదకులు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.
పురాణపండ శ్రీనివాస్ అద్భుతమైన వక్త . రచయిత. సంకలనకర్త. ప్రచురణకర్త. తిరుమల తిరుపతి దేవస్థానాలలో అనేక విభాగాల ఉద్యోగస్తుల గృహాలలో సైతం పురాణపండ శ్రీనివాస్ చక్కటి గ్రంధాలను అధ్యయనం చెయ్యడం విశేషం. ప్రధానార్చకులు లగాయతు వేదపండితుల వరకు అనేక మంది వైఖానస పండిత అర్చక వర్గాలతో సన్నిహిత సంబధాలున్న పురాణపండ శ్రీనివాస్ ని ఎంతో ఆదరణతో ఇక్కడి అర్చక బృందం చూడటానికి శ్రీనివాస్ లోని అద్భుత ప్రతిభతో పాటు నిస్వార్ధ సేవా యజ్ఞ భావనయేనని టి.టి.డి. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉన్నతాధికారులు సైతం సామూహికంగా చెబుతారు.
ఈ ఉదయం శ్రీవారి ప్రత్యేక దర్శనంలో పాల్గొన్న పురాణపండ శ్రీనివాస్ ని రంగ నాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలతో పాటు శ్రీవారి మహా ప్రసాదాన్ని కూడా అందించడం విశేషం.