సమరసింహారెడ్డి & నరసింహనాయుడు ల కలయికే ‘వీరసింహారెడ్డి’ – నిర్మాత నవీన్ యెర్నేని

సమరసింహారెడ్డి & నరసింహనాయుడు ల కలయికే ‘వీరసింహారెడ్డి’ – నిర్మాత నవీన్ యెర్నేని

Published on Dec 24, 2022 6:02 PM IST

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీపై నందమూరి ఫ్యాన్స్ లో అలానే ఆడియన్స్ లో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే వీరసింహారెడ్డి నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు క్రియేట్ చేయగా నేడు ఈ మూవీ నుండి మా బావ మనోభావాలు అనే పల్లవితో సాగే మాస్ బీట్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు మేకర్స్.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సాంగ్ ప్రోమో అందరినీ ఎంతో ఆకట్టుకోవడంతో పాటు ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో సూపర్ గా రెస్పాన్స్ అందుకుంటోంది. కాగా ఈ సాంగ్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని సంధ్య 35 ఎం ఎం థియేటర్ లో ఫ్యాన్స్ మధ్య గ్రాండ్ గా జరిపారు. ఈ సందర్భంగా నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ, వీరసింహారెడ్డి కోసం దర్శకుడు గోపీచంద్ మలినేని ఎంతో కష్టపడ్డారని అన్నారు. నటసింహం బాలకృష్ణ గారి కెరీర్ లో ఈ మూవీ పెద్ద సక్సెస్ అవుతుందని, గతంలో ఆయన నటించిన అతి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీస్ అయిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు మూవీస్ యొక్క కలయికలా వీరసింహారెడ్డి ఉంటుందని, తప్పకుండా సంక్రాంతికి రిలీజ్ తరువాత మీ అందరూ పండుగ చేసుకుంటారని తెలిపారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు