“కేజీయఫ్ 2” కు యష్ సాలిడ్ ప్రిపరేషన్?

“కేజీయఫ్ 2” కు యష్ సాలిడ్ ప్రిపరేషన్?

Published on Sep 26, 2020 11:04 AM IST

మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇపుడు మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని రూల్ చేసే దిశగా అడుగులు వేస్తుంది. అందుకు ఎప్పటి నుంకో అడుగులు పడినప్పటికీ మన తెలుగు చిత్రం “బాహుబలి” అండ్ హీరో ప్రభాస్ తో ఆ డామినేషన్ మొదలయ్యిపోయింది. అయితే ఇపుడు బాహుబలి తర్వాత మళ్ళీ దేశ వ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా ఎదురు చూస్తున్న మరో భారీ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”.

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం షూట్ ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. ముందు హీరోపై కాకుండా ఇతర కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. అయితే ఇప్పుడు యష్ షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

అంతే కాకుండా ఈసారి తన లుక్ కోసం సాలిడ్ ప్రిపరేషన్ లో కూడా ఉన్నాడని టాక్. ముందు చాప్టర్ 1 లో కంటే ఈ చిత్రంలో యష్ ఫిజికల్ లుక్ మరింత స్ట్రాంగ్ గా ఉండేలా సన్నద్ధం అవుతున్నట్టు ఇపుడు తెలుస్తుంది. ఆ లుక్ ను మొత్తం సాలిడ్ గా ప్రిపేర్ చేసి యష్ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొననున్నాడని ఇపుడు టాక్. ఎన్నో అంచనాలను నెలకొల్పుకున్నా ఏఈ చిత్రం మరి ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు