అభిమానులకు రాఖీ భాయ్ లెటర్.. ఎందుకంటే?

అభిమానులకు రాఖీ భాయ్ లెటర్.. ఎందుకంటే?

Published on Dec 30, 2024 10:55 PM IST

కన్నడ హీరో యశ్ ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రం ‘టాక్సిక్’ను తెరకెక్కిస్తున్నాడు. ‘కేజీయఫ్’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా యశ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి ‘టాక్సిక్’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే, తాజాగా యశ్ తన అభిమానులకు ఓ ఓపెన్ లెటర్ రాశాడు. ‘తన అభిమానులు తనపై కురిపిస్తున్న ప్రేమకు ఎల్లప్పుడు కృతజ్ఞుడిని. గత కొన్నేళ్లుగా అభిమానులు తన పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని చూస్తున్నారు. కానీ, కొన్ని అనుకోని ఘటనలను తనను కలిచివేశాయి.. అందుకే తాను ఇలాంటి వేడుకలకు దూరంగా ఉంటున్నానని.. ఇకపై కూడా తన అభిమానుల క్షేమమే తనకు ముఖ్యమని.. తన పుట్టిన రోజున తాను సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటానని..’ యశ్ తన లేఖలో పేర్కొన్నాడు.

అభిమానులు అందించే విషెస్ తనకు ఎల్లప్పుడు చేరుతాయని.. అవి మాత్రమే తనకు సంతోషాన్నిస్తాయని యశ్ ఈ సందర్భంగా తెలిపాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు