క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా, నూతన దర్శకుడు రాహుల్ శంకృష్ణన్ దర్శకత్వంలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘టాక్సీవాలా’. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తోంది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఒకప్పటి మాజీ హీరోయిన్ కళ్యాణి కీలక పాత్రలో కనిపించనున్నదని తెలుస్తోంది.
కాగా కళ్యాణి, ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు వదినగా నటించిందట. ఆమె పాత్ర కథలో చాలా కీ రోల్ అట. మొత్తానికి ఈ సినిమా నవంబర్ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవ్వబోతుంది. ఇప్పుడు ఈ చిత్రం ఫలితం విజయ్ దేవరకొండ కెరీర్ కి చాలా కీలకంగా మారింది.
‘గీత గోవిందం’తో వంద కోట్ల క్లబ్ లోకి విజయ్ చేరినప్పటికీ, ‘నోటా’ చిత్రం పరాజయంతో.. విజయ్ స్టార్ ఇమేజ్ కంటిన్యూ అవ్వాలంటే ఈ సినిమా విజయం సాధించి తీరాలి.