విడుదల తేదీ : జూన్ 14, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు: చాందిని చౌదరి, వశిష్ట సింహా, జై భరత్ రాజ్, అషు రెడ్డి తదితరులు
దర్శకుడు: ప్రకాశ్ దంతులూరి
నిర్మాతలు : నవదీప్, పవన్ గోపరాజు
సంగీత దర్శకుడు: కీర్తన శేష్, నీలేష్ మాండలపు
సినిమాటోగ్రఫీ: ఎస్వి. విశ్వేశ్వర్
ఎడిటింగ్: సృజన అడుసుమిల్లి
సంబంధిత లింక్స్: ట్రైలర్
యంగ్ బ్యూటీ చాందిని చౌదరి నటించిన తాజా చిత్రం ‘యేవమ్’ నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
సౌమ్య(చాందిని చౌదరి) పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గా వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో జాయిన్ అవుతుంది. అందులోనే ఎస్సైగా ఉంటాడు అభిరామ్(జై భరత్ రాజ్). ఒకరోజు ఓ అమ్మాయి హత్యకు గురవుతుంది. సౌమ్య ఈ మర్డర్ వేరొక కేసుతో సంబంధం ఉన్నట్లుగా గుర్తించి యుగంధర్(వశిష్ట సింహా) ఈ హత్యలకు కారణమని తెలుసుకుంటుంది. సినిమా స్టార్స్ ను ఇష్టపడే అమ్మాయిలను ట్రాప్ చేసి అతడు ఈ హత్యలు చేస్తుంటాడు. హంతకుడిని సౌమ్య పట్టుకుంటుందా..? ఈ కేసును సాల్వ్ చేయడంలో అభిరామ్ ఎలా సాయపడ్డాడు..? ఈ కథలో హారిక(అషు రెడ్డి) పాత్ర ఏమిటి..? అసలు యుగంధర్ ఎవరు.. ఈ హత్యలకు గల కారణాలు ఏమిటి..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
చాందిని చౌదరి తొలిసారి ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. చక్కటి పర్ఫార్మెన్స్ తో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. జై భరత్ రాజ్ కూడా తన నటనతో మెప్పించాడు.
అయితే, ఈ సినిమాలో వశిష్ట సింహా తన నటనతో సాలిడ్ ఇంపాక్ట్ చూపిస్తాడు. నెగెటివ్ రోల్ లో అతడి పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ సూపర్ గా ఉంటాయి.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. అయితే, ఆ క్యూరియాసిటీని సినిమాలో మెయింటెయిన్ చేయలేకపోయారు. థ్రిల్లర్ సినిమాలకు కావాల్సిన ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఈ సినిమాలో లోపించింది. అనవసరపు షాట్స్, సాగదీసే సీన్స్ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి.
ఈ సినిమా కథనాన్ని మరింత బలంగా రాసుకోవాల్సింది. ఈ థ్రిల్లర్ సినిమాలో విలన్ ఎవరనే విషయాన్ని ఇంటర్వెల్ లోపే గెస్ చేయగలగడంతో, సెకండాఫ్ పై ఆసక్తి తగ్గిపోతుంది. చాందిని చౌదరి తన పాత్రలో పర్వాలేదనపించింది. అయితే, కొన్ని సీన్స్ లో ఆమె పాత్రకు ప్రాధాన్యత లేకపోవడం.. ఆ సీన్స్ లో ఆమె ఇంకాస్త బెటర్ గా నటించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
వశిష్ట సింహాకు స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకాస్త ఎక్కువ ఇవ్వాల్సింది. థ్రిల్లర్ సినిమాలకు కావాల్సిన ఎంగేజింగ్ మ్యూజిక్ స్కోర్ ఈ సినిమాలో లోపించింది.
సాంకేతిక విభాగం:
రైటర్, డైరెక్టర్ ప్రకాశ్ దంతులూరి తన పేలవమైన రైటింగ్ తో ఈ సినిమాను ఆసక్తికర క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా మలచలేకపోయాడు. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో పాటు మరింత మెరుగైన స్క్రిప్టు ఉండి ఉంటే, ఈ సినిమా రిజల్ట్ వేరే విధంగా ఉండేది. సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించినా, సంగీతం ఎక్కడా ఆకట్టుకోలేకపోయింది. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
ఓవరాల్ గా ‘యేవమ్’ మూవీ ఎలాంటి ఆసక్తికర అంశాలు లేని ఓ సాధారణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా నిలిచింది. చాందిని చౌదరి, వశిష్ట సింహా పర్ఫార్మెన్స్ లు ఆకట్టుకున్నా, వారి పాత్రలను డిజైన్ చేసిన తీరు బాగాలేదు. వీక్ రైటింగ్, పేలవమైన స్క్రీన్ ప్లే, అనవసరపు సీన్స్ కారణంగా ‘యేవమ్’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
123telugu.com Rating: 2/5
Reviewed by 123telugu Team