క‌డుపుబ్బా నవ్వించేందుకు వ‌స్తున్న ”బూమ‌ర్ అంకుల్”

క‌డుపుబ్బా నవ్వించేందుకు వ‌స్తున్న ”బూమ‌ర్ అంకుల్”

Published on Jul 16, 2024 5:45 PM IST

త‌మిళ క‌మెడియ‌న్ యోగిబాబు మెయిన్ లీడ్ లో న‌టించిన కామెడీ ఎంట‌ర్టైన‌ర్ మూవీ ‘బూమ‌ర్ అంకుల్’ మార్చి 29న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద అనుకున్న మేర విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. అయితే, ఇందులోని కామెడీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో ఓటిటి స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు.

ప్ర‌ముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో ‘బూమ‌ర్ అంకుల్’ సినిమాను జూలై 20 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో అందాల భామ ఓవియా హీరోయిన్ గా న‌టించింది. యోగిబాబుతో ఆమె చేసే కామెడీ సీన్స్ ఆడియెన్స్ ను అల‌రిస్తాయ‌ని చిత్ర యూనిట్ చెబుతోంది.

‘బూమ‌ర్ అంకుల్’ సినిమాలో రోబో శంక‌ర్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. ఈ సినిమాను స్వదీస్ ఎమ్ఎస్ డైరెక్ట్ చేశారు. మ‌రి ఓటిటి ఆడియెన్స్ ను ఈ సినిమా ఎంతమేర న‌వ్విస్తుందో తెలియాలంటే జూలై 20 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు