ఇంటర్వ్యూ : రితేష్ రానా – ‘హ్యాపీ బర్త్ డే’ మూవీ ద్వారా ప్రేక్షకులు ఒక సరికొత్త ప్రపంచం, డిఫరెంట్ జానర్ కామెడీని చూస్తారు

Published on Jul 2, 2022 9:00 pm IST

గతంలో శ్రీసింహా హీరోగా తెరకెక్కిన విభిన్న కథా చిత్రం మత్తువదలరాతో మంచి సక్సెస్ అందుకున్న యువ దర్శకుడు రితేష్ రానా తెరకెక్కిస్తున్న తాజా సినిమా హ్యాపీ బర్త్ డే. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ మొన్న రిలీజ్ అయి అందరి నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ జులై 8న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న సందర్భంగా దర్శకడు రితేష్ రానాతో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు.

 

అసలు ఈ సినిమాలో సర్రియల్ కామెడీ అనే ఆలోచన మీదేనా …. ?

నిజానికి మనదేశంలో గన్స్ అనేవి లీగల్ కాదు. అయితే మనమే ఒక ఊహాజనిత ప్రపంచాన్ని సృష్టించి అందరికీ గన్స్ ఇచ్చి ఒక మంచి స్టోరీ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ మూవీ కథ పుట్టింది. అయితే సినిమా యొక్క జానర్ గురించి ప్రేక్షకులకి సందేహం రాకుండా ముందు నుండి ప్రమోషన్స్ లో చెప్పేశాం. ఇటువంటి కథ అసలు తెలుగులో అయితే రాలేదు, అందుకే తీసాము. ఇక ఎక్కడా కూడా లాజిక్స్ మిస్ కాకుండా అందరికీ అర్ధం అయ్యేలా మూవీ సాగుతుంది, అయితే మొత్తంగా ఇది ఒక ఊహాజనిత ప్రపంచం అనేది మాత్రం వారికి కూడా అర్ధం అవుతుంది.

 

మత్తువదలరా టెక్నీకల్ టీమ్ ని ఈ మూవీకి కూడా కొనసాగించినట్లున్నారు.. ?

మేమందరం దాదాపుగా పదేళ్లుగా ప్రయాణం చేస్తున్నాం. మన చుట్టూ మనల్ని అర్ధం చేసుకునే వారు ఉంటె చేసే పని మరింతగా సులువు అవుతుంది. అలానే మా అందరిలో చాలా విషయాల్లో సింక్ ఉన్నపుడు కొనసాగడమే బెటర్ అనిపించింది, అందుకే మళ్ళి వారందరూ ఈ మూవీకి పని చేసారు.

 

అసలు ఇటువంటి సినిమాలు ఇదివరకు వచ్చాయా … దీనిని దేనినుండైనా ప్రేరణగా తీసుకున్నారా … ??

ఈ మూవీ స్క్రీన్ ప్లే క్వెన్ టీన్ టరాంజీనో ‘ఫుల్ప్ ఫిక్షన్’ మాదిరిగా ఉంటుంది. నిజానికి ఈ తరహా మూవీ ఇదివరకు రాలేదు. కథ అంతా కూడా చాప్టర్ వైజ్ గా వెళుతుంది, సినిమా ప్రారంభం తరువాత మెల్లగా ఆడియన్స్ స్టోరీ కి కనెక్ట్ అవుతారు.

 

నిజానికి మూవీ ట్రైలర్ చాలామందికి అర్ధం కాలేదు అనే మాట వినపడుతోంది … దీనిపై మీరేమంటారు …. ??

వాస్తవానికి ట్రైలర్ అందరికీ ఆసక్తికరంగా అనిపించాలి, అలానే కథ అర్ధం కాకూడదు అనే ఉద్దేశ్యంతోనే అలా కట్ చేసాము. సినిమా యొక్క జానర్, నడిచే ప్రపంచం గురించి, అలానే పాత్రల గురించి ట్రైలర్ లో పరిచయం చేసాము. ఇక ఆడియన్స్ కి కథ ఏమిటి అనేది తెలియాలి అంటే తప్పక సినిమా చూడాల్సిందే.

 

మత్తువదలరా లో నటించిన వెన్నెల కిషోర్, నరేష్, సత్య లని మరొకకసారి నుడిలో కూడా తీసుకోవడానికి ప్రత్యేక కారణం ఉందా … ??

అదేమి లేదు వారితో నాకు మంచి ర్యాపొ ఉంది, అలానే నా స్టోరీస్ కి వారు బాగా సింక్ అవుతారు. అందుకే ఇందులోని పాత్రలకు వారు సరిపోతారని భావించి తీసుకున్నాం.

 

గన్స్ మీద స్టోరీ తీశారు కదా, మూవీ లో మీరు ఎన్నిరకాల గన్స్ వాడారు….. ??

దాదాపుగా అన్నిరకాల గన్ మోడల్స్ ని మేము మూవీ లో వాడేశాము. రెంట్ పద్ధతిన వాటిని తెప్పించి, ప్రస్తుత మార్కెట్ లో ఎన్నో రకాల విభిన్న రంగుల్లో స్టైలిష్ గా దొరుకుతున్న సెల్ ఫోన్స్ మాదిరిగా గన్స్ ని కూడా కలర్ఫుల్ గా సిద్ధం చేసి వాడాము.

 

మూవీ ట్రైలర్ లో రాజశేఖర్ పోస్టర్ చూపించడానికి ఏదైనా రీజన్ ఉందా … ??

మనకి బయట రైతు బజార్ ల మాదిరిగా మూవీలో ప్రతి ఏరియాలో ఒక గన్ బజార్ ఉంటుంది . ఇక రాజశేఖర్ గారు నటించిన ఆయుధం మూవీ పోస్టర్ ని, ఆయుధం సేల్ కోసం ఒకింత ఫన్నీ గా ఉంటుందని వాడాము అంతే.

 

మెయిన్ క్యారెక్టర్ కి లావణ్య త్రిపాఠిని తీసుకోవడానికి కారణం … ??

లావణ్య గారు గతంలో నాకు ఒక టివి షో ద్వారా పరిచయం అయ్యారు. చాలా జోవియల్ గా ఉండే మనిషి ఆవిడ. ఈ స్టోరీ అనుకున్నప్పుడు ఆమె అయితే సరిగ్గా సరిపోతారు అనిపించింది. అలానే ఆమె కూడా ఇప్పటివరకు ఇటువంటి పాత్ర చేయలేదు. ఇక సినిమాలో ఆమె మెయిన్ లీడ్ అయినప్పటికీ మిగతా పాత్రలకు కూడా మంచి ప్రాముఖ్యత ఉంటుంది.

 

ఈ మూవీకి థియేటర్ కోసం తీసారా, లేక ఓటిటిలో బావుంటుందని తీసారా … ??

నిజానికి ఇటువంటి ఫన్నీ డిఫరెంట్ ఎంటెర్టైనెంట్ జానర్ మూవీస్ థియేటర్స్ లోనే బాగుంటాయి. ముఖ్యంగా 300 మందికి పైగా ఆడియన్స్ అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తూ చక్కగా నవ్వుకోవడం బాగుంటుంది కదా. అలానే ఇది ఓటిటీ లో కూడా బాగానే వర్క్ అవుతుంది, కొన్నాళ్ల అనంతరం ఓటిటి కి కూడా వస్తుంది కదా.

 

మత్తువదలరా మూవీలో ఒక వెరైటీ కామెడీ చూపించారు … మరి ఇందులో ఏతరహా లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది … ??

ఈ హ్యాపీ బర్త్ డే మూవీ ముఖ్యంగా చాప్టర్ వైజ్ గా కామెడీ తో సాగే సినిమా. ఇందులో మేము కామెడీ లో ఉన్న అన్ని జనర్స్ ని చాఫ్టర్స్ వైజ్ గా టచ్ చేస్తూ వెళ్ళాము. విజువల్ కామెడీ, వ్యంగ్యం, పేరడీ, ఇలా మొత్తం ఏడు జనర్ల కామెడీ ని కూడా టచ్ చేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా కామెడీ చాఫ్టర్లుగా సినిమా తీసాము.

 

ఈ మూవీలో మ్యూజిక్ గురించి చెప్పండి …. ??

ఈ మూవీలో మ్యూజిక్ కి ఎంతో మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఈ తరహా స్టోరీ కి కావలసిన మంచి క్రేజీ మ్యూజిక్ అందించారు సంగీత దర్శకడు కాలభైరవ.

 

పాన్ తెలుగు మూవీ అన్నారు కదా .. .ఇది పాన్ ఇండియా కి ఏమైనా సెటైరా … ??

నిజానికి ఎవరిమీద మేము సెటైర్ వేయలేదండి, జస్ట్ సరదాగా మూవీ ప్రమోషన్స్ కోసం అలా అది వాడాము. అలానే సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం తెలుగు భాషలోనే విడుదలవుతుంది. ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కోసం సరదాగా పాన్ తెలుగు మూవీ టాగ్ పెట్టాము అంతే.

 

కామెడీ అనేది అన్ని భాషల్లో కూడా వర్కౌట్ అవుద్ది కదా .. .మరి ఇతర భాషల్లో మీరు ఎందుకు ట్రై చేయలేదు … .??

కొంత నటుల్ని బట్టే ఉంటుంది. ఇక్కడ అంటే సత్య, వెన్నెల కిషోర్ వంటి వారిని ఊహించుకుని రాయవచ్చు. అదే హిందీలో అయితే ఎలా ఉంటుందో చెప్పలేము. అలానే ముఖ్యంగా ఈ మూవీ మాత్రం తెలుగులీనే తీయాలని తీసాను.

 

ఒకరకంగా పాత్రలు ఎక్కువగా కన్ఫ్యూజన్ ఉంటుంది .. మరి దానిని ఎలా అధిగమించారు … ??

నిజానికి పాత్రలు ఎక్కువ ఉన్నపుడు ఒకింత కన్ఫ్యూజన్ ఉండడం సహజం. ఇది నాన్ లీనియర్ గా సాగె టిపికల్ జానర్ మూవీ, పాత్రలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా తప్పకుండా ప్రతి ఒక్క ఆడియన్ కి మూవీ ఖచ్చితంగా అర్ధం అవతుంది.

 

ఈ మూవీలో చాలా పాత్రలు కనిపిస్తున్నాయి… వీరిలో ఎవరు హైలైట్ అవుతారని భావిస్తున్నారు …. ??

నిజానికి మూవీలో అందరి పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది, తప్పకుండా అందరికీ మంచి పేరు లభిస్తుంది. అయితే లీడింగ్ లేడీ రోల్ చేసిన లావణ్య గారు ఒకింత సినిమాలో ఎక్కువ కనిపిస్తారు. తప్పకుండా ఆమెకు కెరీర్ పరంగా మంచి కాంప్లిమెంట్స్ లభిస్తాయని నమ్మకం ఉంది నాకు.

 

హ్యాపీ బర్త్ డే టైటిల్ గురించి చెప్పండి … ??

ఇందులో లావణ్య గారి క్యారెక్టర్ పేరు హ్యాపీ. అలానే ఆమె బర్త్ డే రోజు సినిమాలో కొన్ని కీలక ఘటనలు జరుగుతాయి అందుకే మూవీ టైటిల్ అలా పెట్టాము.

 

ఎప్పుడూ డిఫరెంట్ జానర్ మూవీస్ ఎంచుకోవడానికి కారణం …. ??

ఫస్ట్ మూవీ మత్తువదలరా మూవీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి కొద్దిపాటి బడ్జెట్ లో తీసిన సినిమా. అది మంచి సక్సెస్ సాధించడంతో దీని కథపై వర్క్ చేశాను. ఒకింత నా సినిమాలు డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటాను.

 

ఎప్పుడూ ప్రయోగాత్మక మూవీస్ చేస్తారా లేక… కమర్షియల్ ఫార్మాట్ స్టోరీస్ చేసే ఆలోచన ఉందా …. ??

నిజానికి హ్యాపీ బర్త్ డే కూడా పక్కాగా సాగే కమర్షియల్ మూవీనే, ఇందులో కూడా గన్స్, యాక్షన్ సీన్స్, పాటలు అన్నిఉంటాయి. కాకపోతే ఒకింత డిఫరెంట్ జానర్ లో సాగే సినిమా అంతే. అలానే ప్రెజెంటేషన్ కూడా కొత్తగా ఉంటుంది.

 

మత్తువదలరా తరువాత మంచి అవకాశాలు వచ్చి ఉంటాయి కదా… కానీ మళ్ళి మైత్రి వారికే చేయడానికి కారణం … ??

వారు మంచి ఫ్యాషన్ ఉన్న నిర్మాతలు. సినిమా అంటే వారికీ ఎంతో ఇష్టం. అలానే నా మీద వారికీ ఎంతో నమ్మకం ఉంది, మా మధ్య మంచి సయోధ్య ఉంది. అందుకే వారితో మళ్ళి చేయడం జరిగింది.

 

నెక్స్ట్ మూవీస్ గురించి చెప్పండి … ??

రెండు కథలు లాక్ అయ్యాయి. అయితే వాటిలో ఏది ఫస్ట్, ఏది నెక్స్ట్ అనేది తెలియాలి అంటే కొద్దిగా టైం పడుతుంది… అన్ని విషయాలు త్వరలోనే చెప్తాను …

ఆల్ ది బెస్ట్ టూ యువర్ ‘హ్యాపీ బర్త్ డే’ సర్… థాంక్యూ

సంబంధిత సమాచారం :

సంబంధిత సమాచారం :