లేటెస్ట్ : SSMB 28 కోసం భారీ ప్లాన్స్ సిద్ధం చేస్తున్న యంగ్ ఫైట్ మాస్టర్స్

లేటెస్ట్ : SSMB 28 కోసం భారీ ప్లాన్స్ సిద్ధం చేస్తున్న యంగ్ ఫైట్ మాస్టర్స్

Published on Aug 24, 2022 12:27 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల ముచ్చటగా మూడవ కలయికలో త్వరలో SSMB28 మూవీ సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ మూవీని దాదాపుగా రూ. 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా దీనిని గ్రాండియర్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీకి యంగ్ ఫైట్ మాస్టర్స్ అన్బరివు ద్వయం పని చేయనున్నారు. ఇప్పటికే కెజిఎఫ్, కెజిఎఫ్ 2 విక్రమ్, వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కి వర్క్ చేసిన వీరిద్దరూ ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ మూవీతో పాటు SSMB28 కి వర్క్ చేస్తున్నారు.

మరోవైపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకున్న ఈ మూవీ కోసం వీరిద్దరూ యాక్షన్ సీన్స్ తో పాటు ఫైట్స్ ని కూడా ఎంతో భారీ స్థాయిలో డిజైన్ చేస్తున్నారట. స్టోరీ, స్క్రీన్ ప్లే, సాంగ్స్, బీజీఎమ్ తోపాటు ఈ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అదిరిపోనున్నాయని తెలుస్తోంది. కాగా ఈ భారీ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు