డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, సూపర్ స్టార్ మహేష్ బాబు (SSMB) ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ పోకిరి చిత్రం 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ ఇండస్ట్రీ హిట్ మూవీ 18 ఏళ్లు పూర్తి చేసుకోవడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ, కామెంట్స్ చేస్తున్నారు. ఈ కోవలోకి యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ చేరారు. ఈ చిత్రం పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
స్కూల్ కారిడార్లలో చిన్నప్పుడు ఈ రన్నింగ్ స్టైల్‌ని అనుకరించడానికి ప్రయత్నించడం నాకు గుర్తుంది. చాలా మంది ఇతర పిల్లల్లాగే, నేను చేశాను అంటూ మహేష్ బాబు రన్నింగ్ స్టైల్ పిక్ పై కామెంట్స్ చేసారు. ది అతని దృష్టిలో ఉన్న తీవ్రత, అణచివేయబడిన కోపం ఈ శైలిని ఐకానిక్‌గా మార్చింది అని కొనియాడారు. నిజంగా ఒక మాస్టర్ పీస్ సినిమా పోకిరి అంటూ చెప్పుకొచ్చారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని మేఘా ధియేటర్ లో ఈ చిత్రం ను చూసినట్లు పేర్కొన్నారు. ఈ ట్వీట్ సోషల్ మీడియా లో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.
ఈ పోకిరి చిత్రం లో ఇలియానా హీరోయిన్ గా నటించగా, ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మానందం, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా, మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు.
I remember trying to mimic this running style as a kid in school corridors. Like so many other kids, I’m sure.
Hands sharp on the sides, legs taking big strides – but it’s never that. It’s the intensity, the suppressed anger in his eyes that made this style iconic.
Truly a… https://t.co/vuRpjtAV0o— Anand Deverakonda (@ananddeverkonda) April 28, 2024