బాలయ్యతో ప్రాజెక్ట్ పై యంగ్ ప్రొడ్యూసర్ ఎగ్జైట్మెంట్.!

బాలయ్యతో ప్రాజెక్ట్ పై యంగ్ ప్రొడ్యూసర్ ఎగ్జైట్మెంట్.!

Published on Jun 11, 2023 8:00 AM IST

ప్రస్తుతం నందమూరి నరసింహాం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడితో అయితే “భగవంత్ కేసరి” అనే సాలిడ్ యాక్షన్ ప్రాజెక్ట్ ఇప్పుడు తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే బాలయ్య కెరీర్ లో 108వ సినిమా కాగా నిన్న బాలయ్య బర్త్ డే సందర్భంగా అయితే దర్శకుడు కొల్లి బాబీ తో అయితే బాలయ్య 109 ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యింది.

మరి ఓ స్టన్నింగ్ కాన్సెప్ట్ పోస్టర్ తోనే ఓ రేంజ్ లో హైప్ ఎక్కించిన ఈ చిత్రాన్ని అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు టేకప్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ నిర్మాణ సంస్థ అధినేత యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ అయితే బాలయ్యతో ప్రాజెక్ట్ పై చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు.

నేను టాలీవుడ్ లో వర్క్ చేయడం స్టార్ట్ చేసిన నాటి నుంచే బాలయ్య గారితో వర్క్ చేయాలని కోరుకున్నానని ఫైనల్ గా ఆ కల నాకు ఇప్పుడు తీరుతుంది అని తెలిపాడు. అలాగే ఈ వారి చిత్రంతోనే బ్యానర్ లో 25వ సినిమా కూడా పూర్తి కానుండడం మరింత సంతోషంగా ఉందని వంశీ అయితే ఓ రేంజ్ లో బాలయ్య తో సినిమా పట్ల ఎగ్జైట్ అవుతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు