యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా కాలేజీ యువత మధ్య జరిగే కథాంశంతో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మ్యాడ్. ఈ మూవీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నటుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చుర్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. సంతోష్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అవంతిక సునీల్ కుమార్, గోపిక ఉద్యన్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది.
భీమ్స్ సిసిలోరియో మ్యూజిక్ అందించిన ఈ మూవీని అక్టోబర్ 6న విడుదల చేయనున్నారు. కాగా ఈమూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని రేపు ఉదయం 10 గం. 18 ని. లకు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆవిష్కరించనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేసారు. కాగా తమ మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో పాటు వారిని మంచి కామెడీ తో గిలిగింతలు పెడుతుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.