లైంగిక వేధింపుల కేసులో నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్

లైంగిక వేధింపుల కేసులో నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్

Published on Dec 18, 2024 7:06 PM IST

యూట్యూబ్‌లో షార్ట్ వీడియోస్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రసాద్ బెహరా రీసెంట్‌గా ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో నటించాడు. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ప్రసాద్ బెహరా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతాడని అందరూ అనుకున్నారు. అయితే, తాజాగా ఆయనపై లైంగిక వేధింపులు, దాడి కేసు నమోదైంది.

ఓ వెబ్ సిరీస్ షూటింగ్‌లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ యువతి జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై దాడికి సంబంధించిన సాక్ష్యాలు కూడా సదరు యువతి సమర్పించినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రసాద్ బెహరాపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ప్రసాద్ బెహరాకి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న ప్రసాద్ బెహరా ఇలా లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ కావడం ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు