‘జీబ్రా’ పది రోజుల వసూళ్లు.. ఎంతంటే?

‘జీబ్రా’ పది రోజుల వసూళ్లు.. ఎంతంటే?

Published on Dec 2, 2024 9:00 PM IST

ట్యాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జీబ్రా’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి ప్రమోట్ చేయడంతో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దీనికితోడు ఈ మూవీ కంటెంట్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.

ఇక ఈ సినిమాకు డీసెంట్ టాక్ రావడంతో ప్రేక్షకులు నెమ్మదిగా థియేటర్లకు వెళ్తున్నారు. ఈ సినిమా రెండో వారంలోకి అడుగుపెట్టినా, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమా పది రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.11.07 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఈ సినిమాను ఈశ్వర్ కార్తీక్ డైరెక్ట్ చేయగా, డాలి ధనుంజయ్ మరో కీలక పాత్రలో నటించాడు. ప్రియ భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు