ట్యాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జీబ్రా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. పూర్తి క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రానున్న ఈ చిత్రాన్ని ఈశ్వర్ కార్తిక్ డైరక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు గతంలో మేకర్స్ వెల్లడించారు.
అయితే, కొన్ని కారణాల వల్ల దీపావళి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయడం లేదని.. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ని త్వరలోనే అనౌన్స్ చేస్తామని మేకర్స్ తెలిపారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసేందుకు చిత్ర యూనిట్ డేట్ ఫిక్స్ చేసింది. అక్టోబర్ 29 ఉదయం 11.45 గంటలకు ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయనున్నట్లు వారు తెలిపారు.
డాలి ధనంజయ మరో లీడ్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్, జెన్నిఫర్ పిచినెటో, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.