జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి క్రేజీ అఫర్ అందించిన జీ5


టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొంది 2018 లో రిలీజ్ అయిన మూవీ అరవింద సమేత వీర రాఘవ. రిలీజ్ తరువాత భారీ సక్సెస్ కొట్టిన ఈ మూవీలో వీర రాఘవరెడ్డి గా ఎన్టీఆర్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్, పూజా హెగ్డే అందం, ఆకట్టుకునే అభినయం, త్రివిక్రమ్ మార్క్ టేకింగ్, డైలాగ్స్, భారీ యక్షన్, మాస్, ఎమోషనల్ సీన్స్ వంటివి ఈ మూవీని పెద్ద సక్సెస్ చేసాయి.

అటు ఎన్టీఆర్, ఇటు త్రివిక్రమ్ మూవీ కెరీర్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా అరవింద సమేత నిలిచిపోతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. అయితే విషయం ఏమిటంటే, ఎప్పటినుండో ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం జీ5 ద్వారా బుల్లితెర ఆడియన్స్ కి అందుబాటులో ఉంది. కాగా డిసెంబర్ 16 నుండి జనవరి 5 వరకు ఈ మూవీని ఉచితంగా చూసే అవకాశాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కల్పించారు జీ5 వారు. మరి అందరినీ ఎంతో ఆకట్టుకున్న ఈ మూవీని మరొక్కసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఫ్రీగా జీ5 లో చూసేయవచ్చని అంటున్నారు సినీ విశ్లేషకులు.

Exit mobile version