‘బొమ్మరిల్లు’ తరహా మ్యాజిక్ మళ్లీ చేసేందుకు హీరో సిద్ధార్థ్, నిర్మాత దిల్ రాజు జత కట్టారు. ‘ఓ మై ఫ్రెండ్’ పేరుతో వస్తున్నఈ సరికొత్త చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. నవదీప్, హన్సికలు ఈ మూవీ లో కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం శిల్ప కళావేదికలో జరిగింది. మలయాళం సంగీత దర్శకుడు రాహుల్ రాజ్ ఈ చిత్రం ద్వారా తొలిసారి తెలుగు తెరకు తన బాణీలు అందించారు. ఈ మూవీ ఆల్బం లో మొత్తం ఏడు పాటలు ఉన్నాయి. వీటి తీరు తెన్నులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం .
1. సాంగ్ : ఓ మై ఫ్రెండ్
గాయకుడు / సింగర్స్ : కార్తీక్
రచయిత : కృష్ణ చైతన్య
ఈ ఫాస్ట్ బీట్ సోలో సాంగ్ అద్భుతంగా ఉంది. కార్తీక్ పాడిన తీరు శ్రేవనానందాన్ని కలిగిస్తుంది. ఈ సాంగ్ కు రాహుల్ రాజ్ అందించిన మ్యూజిక్ తాజా అనుభూతిని ఇస్తుంది. కృష్ణ చైతన్య రచన చాల డీసెంట్ గా ఉంది.
2. సాంగ్ : నువ్వు నేను జట్టు
గాయకుడు / సింగర్స్ : బెన్నీ దయాళ్
రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ఇదో మంచి శృంగార గీతం. సంగీతం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన బావున్నాయి.
3.సాంగ్ : శ్రీ చైతన్య
గాయకుడు / సింగర్స్ : సిద్ధార్థ్, శృతి హాసన్
రచయిత : కృష్ణ చైతన్య
సిద్ధార్థ్ మరియు శృతి హాసన్ పాడిన ఈ పాట వినసొంపుగా ఉంది. ఈ సాంగ్ వింటుంటే ‘బొమ్మరిల్లు’ సినిమాలోని ‘ఉయ్ హేవ్ ఎ రోమియో’ గీతం జ్ఞప్తికి వస్తుంది. విద్యార్ధి జీవితంలోని మధుర స్మృతులను గుర్తు చేసేలా ఈ పాట సాగుతుంది. ఈ పాటకు కృష్ణ చైతన్య అందించిన సాహిత్యం బావుంది. ఈ పాటను తెరపై చూసినప్పుడు ఆహ్లాదంగా కనిపించే అవకాశం ఉంది. మ్యూజిక్ ఓకే.
4.సాంగ్ : ఆలోచన వస్తేనే
గాయకుడు / సింగర్స్ : రంజిత్, సంగీత ప్రభు, సారా స్ట్రాయుబ్
రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ఈ ఆల్బమ్ లో మరో అద్భుతమైన పాట ఇది. ఈ సాంగ్ కు అన్ని విభాగాలనుంచీ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ కనిపించే అవకాశం ఉంది. రంజిత్ , సంగీత ప్రభు, సారా స్ట్రాయుబ్ గానం రాక్ చేసింది. ఈ పాట కు రొమాంటిక్ ఫీల్ తేవటంలో వీరి ప్రతిభ కొట్టొచ్చినట్టు కనబడింది.
5.సాంగ్ : వేగం వేగం
గాయకుడు / సింగర్స్ : బెన్నీ దయాళ్, కవిత మోహన్, జయరాం రంజిత్ , డెస్మండ్ ఎఫ్ (ర్యాప్)
రచయిత : కృష్ణ చైతన్య
ఇది ఒక యూత్ ఫుల్ సాంగ్. ఫ్రెండ్స్ అంతా కలసి ప్రయాణిస్తున్న సందర్భంలోనిది. వేగంగా సాగే ఈ పాటలో గాయనీ, గాయకుల ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది. కృష్ణ చైతన్య రచన భావత్మకంగా ఉంది. సంగీతం అద్భుతంగా లేకున్నా డీసెంట్ గా ఉంది.
6.సాంగ్ : నేను తానని
గాయకుడు / సింగర్స్ : రంజిత్
రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ఇది ఎమోషనల్ సాంగ్. హీరో, అతని గర్ల్ ఫ్రెండ్ మధ్య గల స్నేహాన్ని అపార్థం చేసుకుంటున్నారన్న ఒక భావోద్వేగభరిత పాట.
7.సాంగ్ : మా డాడీ పోకేట్స్
గాయకుడు / సింగర్స్ : సిద్ధార్థ్
రచయిత : కృష్ణ చైతన్య
ఈ పాటను కూడా సిద్ధార్థ్ ఆలపించాడు. సంగీతం విషయంలో ఎలక్ట్రానిక్ గిటార్ ఆధిపత్యం కనిపిస్తుంది. దరువు వాయిద్యాలు బావున్నాయి. ఈ పాట కళాశాల సంగీత పోటీల ఫైనల్ సందర్భంలో వచ్చేటట్టు ఉంది. సిద్ధార్థ్ గానం శ్రావ్యంగా ఉంది. కృష్ణ చైతన్య యొక్క సాహిత్యం గురించి చెప్పాలంటే మాటలు చాలవు.
తీర్పు : మొత్తంగా, ‘ఓ మై ఫ్రెండ్’ పాటలు తాజా అనుభూతిని కలిగిస్తాయి. ఆల్బమ్ లో కొన్ని అద్భుతమైన పాటలు ఉన్నాయి. మలయాళం సంగీత దర్శకుడు రాహుల్ రాజ్ ఈ సినిమాతో తెలుగు తెరకు ఒక మంచి సంగీత దర్శకుడిగా అవతరించారు. ‘ఆలోచన వస్తేనే’, ‘ఓ మై ఫ్రెండ్’ మరియు ‘నేను తానని’ నాకు బాగా నచ్చిన గీతాలు. సిద్ధార్థ్, దిల్ రాజు చేతుల నుంచి జాలువారిన మరో మ్యూజికల్ విన్నర్ ఈ ఆల్బం.
– నారాయణ ఎ.వి