ఆడియో రివ్యూ : డీసెంట్ రొమాంటిక్ ఆల్బం – “ఇట్స్ మై లవ్ స్టొరీ”

ఆడియో రివ్యూ : డీసెంట్ రొమాంటిక్ ఆల్బం – “ఇట్స్ మై లవ్ స్టొరీ”

Published on Oct 22, 2011 4:05 AM IST


‘స్నేహ గీతం’ అనే మృదువైన ప్రేమ చిత్రం తో తెలుగు సినీ పరిశ్రమకు దర్శకునిగా అరంగేట్రం చేసిన నవతరం దర్శకుడు మధుర శ్రీధర్. తన తొలి సినిమాతోనే పరిశ్రమ వర్గాలతోపాటు, విమర్శకుల ప్రసంసలు సైతం ఆయన కైవసం చేసుకున్నాడు. మళ్లీ తాజాగా శ్రీధర్ ‘ఇట్స్ మై లవ్ స్టొరీ’ అనే ఓ సరికొత్త కార్పోరేట్ ప్రేమ కథతో ముందుకొస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సునీల్ కశ్యప్ అందిస్తున్నారు. ఇటీవలే ఆడియో విడుదలైన ఈ చిత్ర గీతాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

1. సాంగ్ : ముప్పై సెకన్లే
కళాకారులు : హేమచంద్ర, సునీల్ కశ్యప్, ప్రణవి, నికిత
సాహిత్యం : సిరా శ్రీ

ఈ పాట నైస్ గిటార్ పనితనం, మరియు సింథసైజర్ బీట్స్ తో మొదలవుతుంది. ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ ఆధునిక యుగంలో జీవనశైలి, సమయ విలువను వివరిస్తుంది. సిరా శ్రీ సాహిత్యం చాలా డీసెంట్ గా ఉంది. సునీల్ కశ్యప్ మ్యూజిక్.. ఈ పాటకు మోడరన్ ఫీల్ ని కలిగించింది. సినిమా ప్రారంభం లో ఈ పాట ఉండే అవకాశం ఉంది. వినసొంపుగా ఉన్న పాట ఇది.

2.సాంగ్ : నీలోని దిగులే
కళాకారులు : ప్రణవి
సాహిత్యం : సిరా శ్రీ

ఈ మృదువైన శృంగార భరిత సోలో సాంగ్ ను ప్రణవి చక్కగా ఆలపించింది. స్మూత్ గా సాగే సంగీతం పాటకు మధురానుభూతిని కల్పించింది. తన ప్రేమికున్ని గూర్చి వివరిస్తూ హీరోయిన్ పడుకునే రొమాంటిక్ సాంగ్ ఇది. ఈ పాటకు సిరా శ్రీ అందించిన సాహిత్యం బావుంది. మొత్తం ఆల్బం లో ఇది ఉత్తమమైన పాట.

3. సాంగ్ : నిండైన నీ చెలిమి
కళాకారులు : కారుణ్య, ప్రణవి
సాహిత్యం : సిరా శ్రీ

ప్రేమికులు విడిపోయేటప్పుడు కలిగే బెంగ, బాధను వెళ్లగక్కే విధంగా సాగేదీపాట. కారుణ్య మరియు ప్రణవిలు పాడిన తీరు వినేవారికి భావోద్వేగాన్ని కలిగించే విధంగా ఉంది. సిరా శ్రీ సాహిత్యం ఈ పాటకు సరిగ్గా సరిపోయింది. సునీల్ కశ్యప్ సంగీతం వినేందుకు బాగానే ఉన్నా కాస్త ఎక్కువ మోతాదులో సింథసైజర్ ఉపయోగించినట్టుగా ఉంది. మొత్తానికి ఇది ఒక మంచి పాటనే చెప్పొచ్చు.

4. సాంగ్ : నిన్నలా లేదే
కళాకారులు : దిన్కర్, చైత్ర
సాహిత్యం : సిరా శ్రీ

యువ జంట తాము ఒకరినొకరు ప్రేమించు కుంటున్నామని తెలుసుకున్నప్పుడు వారికి కలిగే భావోద్వేగాలకు అద్దంపట్టేలా సాగే ఒక చక్కటి శృంగార యుగళ గీతం ఇది. దిన్కర్ మరియు చైత్ర గానం ఓకే . సిరా శ్రీ యొక్క శృంగార భావాలు హత్తుకొనేలా ఉన్నాయి. సునీల్ కశ్యప్ సంగీతం గురించి చెప్పాల్సింది ఏమీలేదు.

5. సాంగ్ : తడిపెదవులే కలిసి
కళాకారులు : కారుణ్య, చైత్ర
సాహిత్యం : సిరా శ్రీ

ఈ ఆల్బమ్ లోని మంచి పాటలలో ఇదొకటి. కారుణ్య పొడవైన రాగం తీస్తూ మొదలు పెట్టే పాట ఇది. ఈ శృంగార యుగళ గీతాన్ని కారుణ్య మరియు చైత్ర మంచిగా ఆలపించారు. సిరా శ్రీ భావాలు బావున్నాయి. ఆధునిక, సాంప్రదాయ మిశ్రమం గా అందించిన సునీల్ కశ్యప్ సంగీతం ఆహ్లాదంగా ఉంది. ఈ పాటను చాలా శృంగార భరితంగా చిత్రీకరించి ఉంటారని భావించవచ్చు.

6. పాట : గల్లాటే..
కళాకారులు : ప్రణవి , సునీల్ కశ్యప్
సాహిత్యం : సిరా శ్రీ

తొలుత ప్రణవి ఆలాపన తో సాగే ఈ సాంగ్ ఐటెం సాంగ్ ను పోలి ఉంది. ఈ పాట ప్రణవి ఎనర్జీ ఏమిటో చాటిచేబుతుంది. సాధారణంగా ఈ తరహ పాటలు ‘కళ్ళు కాంపౌండ్’ వద్ద చిత్రీకరించే అవకాశం. బహుశా ఈ పాట, హీరో తన లవర్ ఎడబాటు సందర్భంలో వచ్చే విధంగా ఉంది. సిరా శ్రీ సాహిత్యం బావుంది. సునీల్ కశ్యప్ సంగీతం మొదట్లో కొత్తగా ఉన్నప్పటికీ రానురాను రొటీన్ గా మారిపోయింది.

తీర్పు : కొన్ని మంచి శృంగార గీతాలతో కూడుకున్న ఒక నైస్ ఆల్బం ‘ఇట్స్ మై లవ్ స్టొరీ’. భారీగా సింథసైజర్ బీట్స్ వాడటం మినహా, సునీల్ కాశ్యప్ సంగీతం బావుంది. ‘తడి పెదవులు’ ‘నీలోని దిగులే’ మరియూ ‘ముప్పై సెకన్లే’ ఈ ఆల్బం లో నాకు నచ్చిన పాటలు. సంగీత ప్రేమికులు కొనుగోలు చేసుకునేందుకు ఒక సురక్షితమైన ఆల్బం ఇది. ప్రేమించే వారికి ఇవ్వదగిన ఒక మంచి పాటల సంపుటి.

– నారాయణ ఎ.వి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు