ఓటిటి సమీక్ష : “14 ఫెరే” – హిందీ చిత్రం జీ 5 లో

ఓటిటి సమీక్ష : “14 ఫెరే” – హిందీ చిత్రం జీ 5 లో

Published on Jul 24, 2021 3:01 AM IST
 14phere Movie Review

విడుదల తేదీ : జూలై 23,2021
123telugu.com Rating : 2.5/5

నటీనటులు : విక్రాంత్ మాస్సే, కృతి ఖర్బండ

దర్శకుడు : దేవాన్షు కుమార్

నిర్మాతలు : జీ స్టూడియోస్

సంగీత దర్శకుడు : రాజీవ్ వి భల్లా

ప్రస్తుతం మేము కొనసాగిస్తున్న పలు వెబ్ షోస్ మరియు డైరెక్ట్ డిజిటల్ సినిమాల రిలీజ్ రివ్యూల పరంపరలో మేము ఎంచుకున్న లేటెస్ట్ చిత్రం “14 ఫెరే” .. జీ 5 స్ట్రీమింగ్ యాప్ లో తాజాగా విడుదల కాబడ్డ ఈ చిత్రం ఎలా ఉందో ఇపుడు సమీక్షలో తెలుసుకుందాం రండి..

 

కథ :

 

ఇక కథలోకి వెళ్లినట్టయితే ఒకే కాలేజ్ కి చెందిన స్టూడెంట్స్ సంజయ్(విక్రాంత్) అలాగే అదితి(కృతి ఖర్బందా) లు. అక్కడ నుంచే వారి పరిచయం నుంచి ప్రేమ వరకు మారి ఒకే చోట జాబ్స్ చేసేవరకు వెళతారు. ఇక ఒక సందర్భంలో తాము పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి పెద్దలను ఒప్పించాలని ప్లాన్ చేస్తారు. కానీ ఆ ప్లానే వారికి అనుకోని సమస్యలా మారుతుంది. మరి వారు వేసిన ఆ ప్లాన్ ఏంటి? వాళ్ళు చివరికి పెళ్లి చేసుకోగలుగుతారా? వారికి ఎదురైన సమస్య ఏంటి అన్నది తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఎలాగో ఈ సినిమా కథ అంతా మెయిన్ లీడ్స్ చుట్టూతానే తిరుగుతుంది కనుక సంజయ్, కృతిలే కనిపిస్తారు. మరి వారి నటన కోసం చెప్పుకుంటే ఆన్ స్క్రీన్ పై వారిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా ప్లెజెంట్ గా బాగుంటుంది. అలాగే సంజయ్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో మంచి నటనను కనబరిచాడు.

అలాగే ఇతర కీలక నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ఇంకా ఈ సినిమాలో కనిపించే కామెడీ ఎపిసోడ్స్ కూడా కాస్త ఫన్ ని జెనరేట్ చేస్తాయి. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కి వస్తే డ్రా బ్యాక్స్ మాత్రం ఎక్కువే కనిపిస్తాయి. ఈ సినిమాలో ఎంచుకున్న కథ ప్రకారం కథనం అనేది మెయిన్ లీడ్ మధ్య అంత ఎఫెక్టీవ్ గా నడిచినట్టు అనిపించదు. కాస్త కామికల్ ఫ్లేవర్ ఉన్నపుడు ఇలాంటి సబ్జెక్ట్స్ ని ఇంకా ఆసక్తిగా నడిపించాలి..

కానీ అదంతా అక్కడక్కడే కనిపిస్తుంది తప్పితే ఓవరాల్ గా మెప్పించదు. అలాగే చాలా చోట్ల కనిపించే కామెడీ కూడా పెద్ద కొత్తగా అనిపించదు ఫోర్జ్డ్ గా అతికించిన నవ్వు కామెడీలా ఉంటుంది. దాని వల్ల ఏదో అలా నవ్వి ఊరుకుంటాం అంతే..ఇంకా చాలా సన్నివేశాలు రొటీన్ గా ఊహించే విధంగానే ఉంటాయి. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా పెద్దగా ఆసక్తిగా ఉండవు.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్ గా అనిపిస్తాయి అలాగే సినిమాటోగ్రఫీ విజువల్ గా చాలా నీట్ గా అనిపిస్తుంది. మ్యూజిక్ పరంగా ఓకే అని చెప్పొచ్చు. కానీ ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది. ఇక దర్శకుడు దేవాన్ష్ సింగ్ విషయానికి వస్తే.. తానూ రాసుకున్న కథ అంతా జస్ట్ కామెడీ యాంగిల్ లోనే ఉంటుంది అనిపిస్తుంది కానీ ఓవరాల్ గా సినిమా పరమ రొటీన్ గానే అనిపిస్తుంది. సో సినిమా అంతా కూడా తన వర్క్ ఓ మాదిరిగా సోసో గానే ఉంటుంది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “14 ఫెరే” అక్కడక్కడా సందర్భానుసారం కామెడీ సీన్స్ మరియు మెయిన్ లీడ్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటాయి. కానీ చాలా మట్టుకు రొటీన్ గా ఉండే సన్నివేశాలు సహా నరేషన్ లు యావరేజ్ గా ఉంటాయి అలాగే డైరెక్షన్ లో కూడా ఇంకా డెప్త్ ఉంటే ఈ సినిమా ఇంకా బాగా వచ్చి ఉండేది. సో స్ట్రిక్ట్ గా అయితే కాస్త కామెడీ కోసం ఈ సినిమా చూడొచ్చు లేదా ఛాయిస్ గా వదిలేయొచ్చు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు