విడుదల తేదీ : ఏప్రిల్ 22, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: గగన్ విహారి, అపర్ణా దేవి
దర్శకత్వం : జగత్
నిర్మాతలు: భాస్కర్ యాదవ్ దాసరి
సంగీత దర్శకుడు: ఓషో వెంకట్
సినిమాటోగ్రఫీ: కృష్ణ ప్రసాద్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
కేజీఎఫ్ 2 చిత్రం ఫుల్ స్వింగ్‌లో ఉన్నందున, బాక్సాఫీస్ వద్ద పెద్దగా మార్పు ఏమీ రాలేదు. 1996 ధర్మపురి పేరుతో ఒక చిన్న చిత్రం పెద్ద తెరపైకి నేడు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం.
కథ:
1996 ధర్మపురిలో జరిగిన కథ ఇది. చాలా సామాన్యమైన నేపథ్యాల నుండి వచ్చిన సూరి (గగన్ విహారి) మరియు మల్లి (అపర్ణా దేవి) గురించి ఉండనుంది. వీరిద్దరూ ప్రేమలో పడతారు. అంతా బాగానే ఉన్నట్లు అనిపించినప్పుడు, మల్లి ఫైనాన్స్ సమస్యలను కలిగిస్తుంది. ఇంతేకాక ఈ ప్రేమ కథకి గ్రామ రాజకీయాలు కూడా ఊపిరి పోశాయి అని చెప్పాలి. కానీ ఈ జంట అన్ని అసమానతలను అధిగమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి రోజు సూరి కనిపించకుండా పోవడంతో కథలో అసలైన ట్విస్ట్ పుడుతుంది. సూరికి ఏమైంది? అతడు ఎక్కడికి వెళ్ళాడు? మల్లి ఇప్పుడు ఏం చేస్తుంది? వీటన్నిటికీ సమాధానాలు తెలియాలంటే పెద్ద స్క్రీన్‌పై సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో ఎలాంటి డీవియేశన్స్ లేకపోవడం సినిమాకి ఉన్న అతి పెద్ద అసెట్ అని చెప్పాలి. సెటప్, బ్యాక్‌డ్రాప్ మరియు రియలిస్టిక్ స్క్రీన్ ప్లే రెండు భాగాలలోనూ చాలా బాగున్నాయి. మట్టి విజువల్స్ మరియు గ్రామీణ భావోద్వేగాలు సినిమాలో బాగా పనిచేశాయి.
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, హీరో గగన్ విహారి చాలా బాగా చేసాడు. అతను అమాయకమైన, మొండి పట్టుదల గల పల్లెటూరి వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశాడు. మంచి టాలెంట్ ఉన్న అతడిని సక్రమంగా వాడుకుంటే సినిమాకి హైలైట్ అవుతుంది. సెకండాఫ్‌లో క్రియేట్ చేసిన సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగున్నాయి.
అపర్ణా దేవి ఈ చిత్రం లో లేడి లీడ్ రోల్ లో నటించడం జరిగింది. ఆమె తెలంగాణకు చెందిన స్మాల్ టౌన్ అమ్మాయిగా చూపించడం జరిగింది. సెకండాఫ్‌లో తన నటన చాలా బాగుంది, క్లైమాక్స్‌లో బాగా ఆకట్టుకుంది. గ్రామ పెద్దలుగా నటించిన నాగ మహేష్, జనార్ధన్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్:
సినిమా కథ చాలా రొటీన్‌గా ఉంది. ఈ చిత్రం నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించినందున, ఇందులో మసాలా జోడించడానికి, కథను మార్చడానికి ఏమీ లేదు. ఈ చిత్రం లో మెయిన్ ప్లాట్ లోకి వెళ్ళడానికి మేకర్స్ చాలా సమయం తీసుకున్నారు. చాలా స్లో గా నరేట్ చేసిన విధానం తో బోరింగ్ గా అనిపిస్తుంది.
అలాగే, సినిమా లో సమయానికి అనుగుణంగా వచ్చిన ట్విస్ట్ బాగుంది. దాన్ని మరింత బాగా చూపిస్తే ఇంకా బాగుండేది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి, అదే విధంగా ఆకట్టుకొనే ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి, కాకపోతే వాటిని మరింత ట్రిమ్ చేయాలి.
సాంకేతిక విభాగం:
స్మాల్ టౌన్ బ్యాక్‌డ్రాప్, ఎమోషన్స్‌ని అందంగా క్యాప్చర్ చేసిన కెమెరా పనితనం చాలా బాగుంది. ఓషో వెంకట్ సంగీతం ఆకట్టుకుంది. పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఆకట్టుకున్నాయి. తెలంగాణ భాష వాడిన విధానం, ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. స్క్రీన్‌ప్లే డీసెంట్‌గా ఉంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
దర్శకుడు జగత్ విషయానికి వస్తే, సినిమాను చాలా డీసెంట్ గా చూపించాడు. అతను నిజ జీవిత కథను తీసుకొని దాని చుట్టూ మంచి భావోద్వేగాలను అల్లాడు. అతని స్క్రీన్ ప్లే చాలా చక్కగా ఉంది. కానీ అతను ఫేమస్ నటీనటులను తీసుకొని, మరింత నాటకీయతను జోడించినట్లయితే, చాలా ఎఫెక్టివ్ గా ఉండేది.
తీర్పు:
1996 ధర్మపురి చిత్రం ఇంట్రెస్టింగ్ గా, మంచి బ్యాక్ గ్రౌండ్ తో మంచి పర్ఫామెన్స్ లతో కూడిన వాస్తవిక ప్రేమకథ. అయితే, కీలకమైన అంశాల్లో డ్రామాను మరింత ఎలివేట్ చేసి ఉండాల్సింది. అయితే క్యూరియాసిటీ ఫ్యాక్టర్ ని బాగా మెయింటైన్ చేయడం కారణం గా ఈ సినిమాను ఈ వారాంతంలో చూడవచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team