సమీక్ష : ‘2.0’ – అద్భుత విజువల్ థ్రిల్లర్

2.0 movie review

విడుదల తేదీ : నవంబర్ 29, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.75/5

నటీనటులు : రజినీకాంత్ ,అక్షయ్ కుమార్ ,అమీ జాక్సన్ తదితరులు

దర్శకత్వం : యస్ శంకర్

నిర్మాత : సుభాష్ కరణ్

సంగీతం : ఏఅర్ రహమాన్

సినిమాటోగ్రఫర్ : నిరవ్ షా

స్క్రీన్ ప్లే : యస్ శంకర్

ఎడిటింగ్ : ఆంటోనీ

సూపర్‌ స్టార్ రజినీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘2.ఓ’. ఏఅర్ రహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
 
కథ :

 
చెన్నైలో ఉన్నట్టు ఉండి సడెన్ గా ప్రజల సెల్ ఫోన్స్ గాలిలోకి వెళ్ళిపోయి మాయమవుతూ ఉంటాయి. అసలా ఫోన్స్ ఎలా మయమవుతున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో పోలీసులకు, ప్రజలకు ఏం అర్ధం కాదు. దాంతో ఆ ఫోన్స్ గురించి తెలుసుకోవడానికి సైంటిస్ట్ వశీకరన్ (రజినీ కాంత్ ) తన టెక్నాలజీని ఉపయోగించి.. చివరకి ఆ సెల్ ఫోన్స్ ను ఓ నెగిటివ్ ఫోర్స్ మాయం చేస్తుంది అని తెలుసుకుంటాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఆ సెల్ ఫోన్స్ అన్ని కలిసి ఒక పక్షి ఆకారంలో మారి అతి దారుణంగా కొంతమందిని చంపుతుంది. ఇక ఈ పరిస్థితిని అదుపు చేయడానికి తప్పని పరిస్థితుల కారణంగా సైంటిస్ట్ వశీకరన్ కి చిట్టి ని రీ లాంచ్ చెయ్యటానికి ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. రీ లాంచ్ అయిన చిట్టి ఆ నెగిటివ్ ఫోర్స్ ని అంతం చెయ్యడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? చివరకి అంతం చేశాడా లేడా ? ఈ క్రమంలో చిట్టి 2.ఓ గా రీ లోడ్ ఎలా చెయ్యబడతాడు ? అసలు ఆ నెగిటివ్ ఫోర్స్ కు సెల్ ఫోన్స్ కు ఉన్న సంబంధం ఏమిటి ? దీని వెనకాల ఉన్న కథ ఏమిటి ? చిట్టి 2.ఓ ఈ పరిస్థితి ని ఎలా అదుపులోకి తీసుకువస్తాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
 
ప్లస్ పాయింట్స్ :
 

ఈ చిత్రం అద్భుతమైన విజువల్స్ తో భారీ నిర్మాణ విలువలతో మరియు భారీ తారాగణంతో తెరకెక్కించబడటమే ఈ సినిమా ప్రధాన బలం. టెక్ మాంత్రికుడు శంకర్ భారతీయ సినీ తెర పై చేసిన ఇంద్రజాలమే.. ఈ విజువల్ వండర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహాం లేదు. ఇన్నాళ్లు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినీ అభిమానులకు శంకర్ గుర్తుపెట్టుకునే మంచి విజువల్ ట్రీట్ ఇచ్చారు. సినిమా చూస్తున్నంతసేపూ ఓ అత్యుత్తమైన హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ తెచ్చిన దర్శకుడుకి మరియు ఆయన టీమ్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలపాలి.

ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలో ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. ముఖ్యంగా 2.ఓ గా రీ లోడ్ అయ్యాక రజిని తన మ్యానరిజమ్స్ తో తన శైలి నటనతో బాగా అలరిస్తారు. ఇక సినిమాకే అతి కీలక మైన పాత్రలో అత్యంత క్రూరమైన పాత్రలో మరియు క్రో మ్యాన్ గా నటించిన అక్షయ్ కుమార్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఆయనకు సంబంధించిన కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ లో అక్షయ్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఇక ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. శంకర్ ఎక్కడా విజువల్ ట్రీట్ తగ్గకుండా.. మరియు కథలోని ఎమోషన్ని చాలా బ్యాలెన్స్ డ్ గా నడుపుతూ మంచి దర్శకత్వ పనితనం కనబర్చారు. సెల్ ఫోన్ కు సంబధించి ఆయన చెప్పాలనుకున్న అంశాలు కూడా బాగా ఆకట్టుకుంటాయి. అలాగే సినిమాలో ఆయన ఇచ్చిన గ్లోబల్ మెసేజ్ కూడా మెచ్చుకోతగినది.
 
మైనస్ పాయింట్స్ :
 
దర్శకుడు శంకర్ విజువల్స్ మరియు టేకింగ్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ కథనం మీద పెట్టలేదనిపిస్తుంది. సినిమాలోని ఒక్కో సన్నివేశం వీడిగా చూస్తే, ఆ యాక్షన్ సన్నివేశాలు మరియు ఆ రిచ్ విజువల్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. కానీ సినిమా మొత్తంగా చూసుకుంటే అక్కడక్కడ కథనం ప్లో తప్పగా.. కొన్ని సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా సాగవు. దీనికి తోడు సినిమా మొత్తం చాలా సీరియస్ గా సాగుతూ ఉండటం వల్ల.. ఎంటర్ టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులు కొంత అసహనానికి గురి అవుతారు.

ముఖ్యంగా కొన్ని సన్నివేశాలను అనవసరంగా లాగడం వల్ల ఆ సాగ తీత సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అయింది. అమీ జాక్సన్ కూడా ఒక రోబో అవ్వటం వల్ల.. సినిమాలో హీరోయిన్ మిస్ అయిందనే ఫీల్ కూడా కలుగుతుంది. ఇంకా టైట్ స్క్రీన్ ప్లే మరియు ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఉండి ఉంటే ఈ సినిమా పూర్తి సంతృప్తికరంగా ఉండి ఉండేది.
 
సాంకేతిక విభాగం :
 
దర్శకుడు శంకర్ భారీ విజువల్స్ తో భారీ చిత్రాన్ని తెరకెక్కించి గుర్తుపెట్టుకునే మంచి విజువల్ ట్రీట్ ఇచ్చారు. సినిమా చూస్తున్నంతసేపూ ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ తెచ్చిన దర్శకుడు పనితనం మెచ్చుకోని తీరాలి. అయితే కొన్ని సన్నివేశాలను అద్భుత విజువల్స్ తో బాగా తెరకెక్కించినప్పటికీ.. కథనం మాత్రం ఆ స్థాయిలో ఆయన రాసుకోలేదు.
ఏఅర్ రెహమాన్ అందించిన సంగీతం బాగుంది. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఉన్న విజువల్స్ ను ఇంకా ఎలివేట్ చేస్తూ బాగా ఆకట్టుకుంటుంది. నిరవ్ షా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ఆయన, దర్శకుడి ఆలోచనకు తగ్గట్లు భారీ విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఆంటోని ఎడిటింగ్ కూడా బాగుంది. కానీ అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. ఇలాంటి విజువల్ వండర్ ని అందించినందుకు సుభాష్ శరన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి.
 
తీర్పు :
 
సూపర్‌ స్టార్ రజినీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన విజువల్స్ తో మరియు భారీ నిర్మాణ విలువలతో సాగుతూ ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్ ఇస్తోంది. సినిమా చూస్తున్నంతసేపూ ఓ అత్యుత్తమైన హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుంది.

అయితే దర్శకుడు శంకర్ విజువల్స్ మరియు టేకింగ్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ కథనం మీద పెట్టలేదనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు స్లోగా సాగుతాయి. దీనికి తోడు సినిమా మొత్తం చాలా సీరియస్ గా సాగుతూ ఉండటం వల్ల.. ఎంటర్ టైన్మెంట్ మరియు రొమాన్స్ కోరుకునే ప్రేక్షకులు కొంత అసహనానికి గురి అవుతారు. కాగా, ఓవరాల్ గా ఈ సినిమా విజువల్స్ పరంగా అద్భుతంగా అనిపిస్తూ.. యాక్షన్ థ్రిల్లర్ అంశాలతో మెప్పిస్తోంది. పైగా సినిమాలో ఉన్న గ్లోబల్ మెసేజ్ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

123telugu.com Rating :3.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version