సమీక్ష : ఎ (యాడ్ ఇన్ఫినిటమ్) – అక్కడక్కడా ఆకట్టుకునే డిఫరెంట్ థ్రిల్లర్

సమీక్ష : ఎ (యాడ్ ఇన్ఫినిటమ్) – అక్కడక్కడా ఆకట్టుకునే డిఫరెంట్ థ్రిల్లర్

Published on Mar 6, 2021 3:02 AM IST
 A movie review

విడుదల తేదీ : మార్చి 05, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.5/5

నటీనటులు : నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రానీ

దర్శకత్వం : ఉగాందర్ ముని

నిర్మాత‌లు : గీతా మిన్సాలా

సంగీతం : విజయ్ కురకుల

సినిమాటోగ్రఫీ : ప్రవీణ్ కె బంగారి

ఎడిటింగ్ : ఆనంద్ పవన్, మణికందన్.ఏ

ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ సినిమాలకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూస్తూనే ఉన్నాము. మరి ఈ జానర్ లో ఒక సరికొత్త ప్రయోగంతో మంచి బజ్ ను సంతరించుకున్న లేటేస్ట్ చిత్రం “ఎ(ఎడి ఇన్ఫినిటీయం)”. నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతీ అస్రాణి హీరోయిన్ గా యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది మరి ఈ చిత్రం ఎంతమేర థ్రిల్ చేసిందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

హైదరాబాద్ కు దూరంగా తన మెమొరీని పోగొట్టుకున్న వ్యక్తిగా సంజీవ్(నితిన్ ప్రసన్న) ఓ రెస్క్యూ టీమ్ కు దొరుకుతాడు. అక్కడ నుంచి హాస్పిటల్ లో అడ్మిట్ అయిన తన లైఫ్ లోకి నర్స్ పల్లవి(ప్రీతీ అస్రాణి) రావడం వారి స్నేహం పెళ్లి వరకు వెళ్లడం జరుగుతుంది కానీ ఊహించని పరిణామాల రీత్యా అతడికి కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తుంటాయి. అలా అతడికి 1970ల కాలం నాటికి చెందిన అశ్వథ్థామ అనే అతనికి ఉన్న కనెక్షన్ ఏంటి? ఇంతకీ ఇందులో వీరు చేసిన ప్రయోగం ఎలాంటిది? చివరికి ఈ కథ ఎలా ముగుస్తుంది అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెర మీద చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఇలాంటి థిల్లర్ చిత్రాల్లో అనుక్షణం నరేషన్ ఆసక్తిగా ఉండాలని కోరుకుంటాం అది ఈ చిత్రంలో ఫస్ట్ హాఫ్ నుంచి కూడా కనిపిస్తుంది. సంజీవ్ మరియు పల్లవిల మధ్య వచ్చే కొన్ని ఎపిసోడ్స్ బాగా అనిపిస్తాయి. ఇంకా సినిమాలో ఎంచుకున్న మెయిన్ థీమ్ పాయింట్ ను ఇంటర్వెల్ బ్లాక్ లో రివీల్ చెయ్యడం వాటిని సెకండాఫ్ లో కూడా బాగా క్యారీ చెయ్యడం వంటివి మంచి థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి.

ఇక నటీ నటుల విషయానికి వస్తే హీరో నితిన్ సుపర్బ్ వర్క్ ఇచ్చాడని చెప్పాలి. కేవలం తన నటనలోనే కాకుండా మేకోవర్ లో కూడా సూపర్బ్ షేడ్స్ తో ఆకట్టుకుంటాడు. అలాగే హీరోయిన్ ప్రీతీ కూడా మంచి నటనను కనబరిచింది. ఇంకా అలాగే ఇతర నటీనటులు సహా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కనిపించిన వారు కూడా తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కు వచ్చినట్టు అయితే ఇందులో కాన్సెప్ట్ కొత్తగా బాగానే ఉన్నా దాన్ని కనుక ఇంకా బాగా డిటైల్డ్ అండ్ గ్రిప్పింగ్ గా చూపించి ఉంటే మరింత అందంగా ఎలివేట్ అయ్యి ఉండేది. అలాగే ఎంత థ్రిల్లర్ అండ్ లాజికల్ గా సినిమాలు తీస్తున్నా ఎక్కడో కొన్ని చోట్ల అనవసరపు లాజిక్కులు చాలానే కనిపిస్తాయి.

రోడ్ సైడ్ లోనే పిల్లల్ని కిడ్నాప్ చేసినపుడు ఆ చేసిన వాడిని పట్టుకోడంలో వచ్చిన సీన్స్ అసలు లాజికల్ గా ఉండవు. అలాగే ఇంకో సీన్..ముప్పై ఏళ్ల నుంచి ఒకటే ప్రయోగం ను ఎవరికి తెలియకుండా చేస్తూ అనేది కాస్త ఓవర్ గా కూడా అనిపిస్తుంది. మరి ఇంకా అసలు ఈ సినిమా టైటిల్ కు ఈ సినిమాలో సరైన వివరణ కూడా కనిపించకపోవడం గమనార్హం.

 

సాంకేతిక విభాగం :

 

మొదటగా ఈ ఎంగేజింగ్ థ్రిల్లర్ లో మంచి జాబ్ ఇచ్చింది సినిమాటోగ్రఫీ మరియు సంగీత విభాగం అని చెప్పాలి. ప్రవీణ్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ సినిమాలోని సోల్ ను చాలా రియలిస్టిక్ గా చూపిస్తుంది. అలాగే విజయ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ విజువల్స్ పర్ఫెక్ట్ గా లీనం చేసేలా చేస్తుంది. కానీ ఎడిటింగ్ వర్క్ మాత్రం ఇంకా బెటర్ గా ఉంటే మరింత మంచి అవుట్ ఫుట్ వచ్చి ఉండేది.

ఫైనల్ గా దర్శకుడు యుగంధర్ ముని పనితనంకి వస్తే..తాను ఎంచుకున్న లైన్ అలాగే ముందు నుంచి తెప్పించిన హైప్ ను మ్యాచ్ చేస్తూ ఎస్టాబ్లిష్ చెయ్యడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. కాకపోతే ఈ కాన్సెప్ట్ ను కనుక ఇంకా డిటైల్డ్ చూపించి ఉంటే ఈ సినిమా మరో లెవెల్లోకి వెళ్లి ఉండేది. అయినా ఇక్కడి వరకు కూడా తాను చక్కగా హ్యాండిల్ చేశారు. ఇందులో మెచ్చుకోవాల్సిందే.

 

తీర్పు :

 

ఇంక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ “ఎ(ఎడి ఇన్ఫినీటం)” థ్రిల్లర్ సినిమాలను కోరుకునే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది అని చెప్పాలి. అందులోని కాస్త కొత్త కాన్సెప్ట్ ను కోరుకునే వారిని కూడా ఈ చిత్రం మెప్పిస్తుంది. జస్ట్ కొన్ని లాజిక్ మిస్సయిన ఎపిసోడ్స్ మినహాయిస్తే హీరో నితిన్ మరియు ప్రీతిల నటన ఎంగేజింగ్ గా సాగే నరేషన్ ఆకట్టుకుంటాయి. మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారు అయితే ఈ వారాంతంలో మీకు ఈ చిత్రం అందుబాటులో ఉంటే తప్పక చూడొచ్చు.

123telugu.com Rating :  2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు