సమీక్ష : “ఏ1 ఎక్స్‌ప్రెస్” – ఆకట్టుకునే స్పోర్ట్స్ డ్రామా

 A1 Express movie review

విడుదల తేదీ : మార్చి 05, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  3/5

నటీనటులు : సుందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, రావు రమేష్, మురళీ శర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ

దర్శకత్వం : డెన్నిస్ జీవన్ కనుకొలను

నిర్మాత‌లు : టి. జి. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం

సంగీతం : హిప్ హాప్ తమీజా

సినిమాటోగ్రఫీ : కవిన్ రాజ్

ఎడిటింగ్ : చోటా. కె. ప్రసాద్

సందీప్ కిషన్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా డెన్నిస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం “ఏ1 ఎక్స్ ప్రెస్”. మంచి అంచనాలు మరియు బజ్ నడుమ ఈ చిత్రం ఈరోజే సిల్వర్ స్క్రీన్స్ ను హిట్ చేసేందుకు వచ్చింది. మరి ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వచ్చినట్టు అయితే యానాం లోని ఓ హాకీ గ్రౌండ్ కు సంబంధించి మొదలవుతుంది. అక్కడి లోకల్ రాజకీయ నాయకుడు(రావు రమేష్) ఈ ల్యాండ్ పై కన్నేసి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అమ్మాలని చూస్తాడు. మరి ఈ క్రమంలో మరో పక్క సంజు(సందీప్ కిషన్) లావ్(లావణ్య త్రిపాఠి) అనే ఓ హాకీ ప్లేయర్ ను తన లవ్ లో పడేయాలని చూస్తుంటాడు కానీ కొన్ని ఊహించని సంఘటనల రీత్యా సంజు ఆ గ్రౌండ్ ను కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి దానికి దారి తీసిన బలమైన కారణం ఏంటి? అసలు సంజూ బ్యాక్ స్టోరీ ఏంటి అన్నవి తెలియాలి అంటే ఈ స్పోర్ట్స్ డ్రామాను వెండితెర పై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

మొదటగా నటీనటుల పెర్ఫామెన్స్ విషయానికి వస్తే సందీప్ కిషన్ ఈ సినిమాకు చేసిన గ్రౌండ్ వర్క్ అలాగే మొదటి నుంచి తనలో ఉన్న తపన కంప్లీట్ గా ఈ సినిమాలో కనిపిస్తుంది. ఒక స్పోర్ట్స్ పర్సెన్ లానే కాకుండా రోమ్ కామ్ రోల్ లో కూడా సూపర్బ్ గా కనిపించాడు. మరి అలాగే సందీప్ ఎమోషన్స్ ను కూడా చాలా బాగా పండిస్తాడు అలాంటి కొన్ని విపరీత భావోద్వేగ సన్నివేశాల్లో సందీప్ మంచి నటనను కనబరిచాడు. అంతే కాకుండా హాకీ మ్యాచ్స్ టైం లో సెటిల్డ్ ఫిజిక్ తో ఓ రియల్ స్పోర్ట్స్ పర్సన్ లా కనిపిస్తాడు.

ఈ సినిమా నటుల్లో మరో స్పెషల్ మెన్షన్ ఎవరినైనా చెయ్యాలి అంటే అది రావు రమేష్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఆయన ఎన్నో సాలిడ్ రోల్స్ చేశారు అలాంటి వాటిలో ఈ సినిమాలోది కూడా ఒకటి చెప్పొచ్చు. ఓ పొలిటీషియన్ గా సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు ఆధ్యంతం సాలిడ్ నటనను కనబరిచారు. అలాగే మరో సెటిల్డ్ నటుడు మురళీ శర్మ హాకీ కోచ్ గా మంచి పాత్రలో కనిపించారు. ఇక లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే ఒకపక్క తాను గ్లామరస్ గానే కాకుండా తాను కూడా ఓ స్పోర్ట్స్ ఉమెన్ గా తన పాత్ర పరిధి మేర బాగా చేసింది. తనకి సందీప్ కు మధ్య కొన్ని ఎమోషన్స్, రొమాంటిక్ సీన్స్ వంటి వాటిలో మంచి కెమిస్ట్రీ కనబడుతుంది.

అయితే ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలో విజువల్స్ చాలా ముఖ్యం అవి ఎంత రియలిస్టిక్ గా ఉంటే ఆడియెన్స్ కు ఒక నిజమైన మ్యాచ్ చూసిన అనుభవం కలుగుతుంది వాటిని ఇందులో అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్ మ్యాచ్ అయితే ఒక పక్క మంచి టెన్స్ తో పాటుగా అద్భుతమైన విజువల్స్ కనిపిస్తాయి.వీటితో పాటుగా ఈ స్పోర్ట్స్ లో ఎలాంటి కార్పొరేట్ పాలిటిక్స్ జరుగుతున్నాయి వాటిపై అందరు తెలుసుకోవాల్సిన ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆకట్టుకుంటుంది. అలాగే కథానుసారం వచ్చే ట్విస్ట్ కానీ అక్కడక్కడా కామెడీ సీన్స్ కానీ బాగుంటాయి. వీటితో పాటుగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చిన రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిల కాంబో నవ్వులు పూయిస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

మామూలుగా ఓ స్పోర్ట్స్ డ్రామా అంటే ఆ స్పోర్ట్స్ పర్సెన్ కు సంబంధించి కొన్ని ఇన్స్పైరింగ్ ఎపిసోడ్స్ ను ఆశిస్తారు. కానీ అందుకు ఇది డిఫరెంట్ గా ఉంటుంది. అలాంటి అంశాలను ఆశించేవారికి వారికి మాత్రం నిరాశ తప్పదు. పైగా ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇంటర్వెల్ ట్విస్ట్ వచ్చే వరకు సో సో గానే అనిపిస్తుంది.

ఇందులో మరింత గ్రిప్పింగ్ నరేషన్ ను పెడితే బాగుండేది. అలాగే మరో డ్రా బ్యాక్ ఏమిటంటే అవతల హాకీ టీం లో కోచ్ గా తీసుకున్న రోల్ ను ఇంకా స్ట్రాంగ్ గా బెటర్ నటుడిని కానీ తీసుకొని ఉంటే రెండు టీమ్స్ నడుమ పోటీ సన్నివేశాలు ఇంకా ఆసక్తికరంగా ఖచ్చితంగా ఉండేవి కానీ అలా చెయ్యలేదు.

 

సాంకేతిక విభాగం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం ఖచ్చితంగా స్పెషల్ గా ఉన్నాయని చెప్పాలి. ఒరిజినల్ వెర్షన్ కంటే కూడా మేకర్స్ చాలానే మార్పులు చేర్పులు చెయ్యడమే కాకుండా అన్ని విభాగాల్లో కూడా టెక్నిషియన్స్ మంచి అవుట్ పుట్ ను అందించారు. ముఖ్యంగా కెవిన్ రాజ్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ అవుట్ స్టాండింగ్ గా ఉంటుంది. అలాగే హిప్ హాప్ తమీజా మ్యూజిక్ కూడా ఈ చిత్రంలో మరో ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. డైలాగ్స్ బాగున్నాయి, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఓకే అనిపిస్తుంది.

ఇక దర్శకుడు డెన్నిస్ జీవన్ కనుకొలను విషయానికి వస్తే..ఆల్రెడీ తాను చేసింది రీమేక్ సబ్జెక్ట్ కాబట్టి మెయిన్ లైన్ లో చెప్పడానికి ఏమీ లేదు కానీ దానిని ఎలా హ్యాండిల్ చేసాడు అన్నదే ఇక్క పాయింట్. ఈ విషయంలో మాత్రం డెన్నిస్ కు తన మొదటి ప్రయత్నంలో మంచి మార్కులు వెయ్యొచ్చు. నటీనటుల నుంచి సాలిడ్ పెర్ఫామెన్స్ లను ఈ దర్శకుడు రాబట్టుకున్నాడు. అంతే కాకుండా కొన్ని ఎమోషన్స్ ను హ్యాండిల్ చేసిన విధానం కూడా బాగుంది. కాకపోతే కొన్ని సీన్స్ లో నరేషన్ పై ఇంకా ఎక్కువ దృష్టి పెడితే పెడితే బాగుండేది. మిగతా అంతా తన వరకు చెయ్యగలిగింది వంద శాతం చేసాడు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే “ఏ1 ఎక్స్ ప్రెస్”..ఓ ఎంగేజింగ్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పాలి. కామెడీ, యాక్షన్ సహా ఇంట్రెస్టింగ్ గా అనిపించే హాకీ ఎపిసోడ్స్ మరియు నటీ నటుల ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ లు చాలా బాగుంటాయి. కాకపోతే స్టోరీ లైన్ కాస్త ఊహించినదగినదే అనిపిస్తుంది కానీ దానిని తెరకెక్కించిన విధానం మాత్రం ఆకట్టుకుంటుంది. ఈ చిన్న లైన్ ను పక్కన పెడితే సింపుల్ గా ఈ వారాంతానికి ఈ సినిమా ఖచ్చితంగా చూడొచ్చు.

123telugu.com Rating :  3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version