సమీక్ష : “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” – అక్కడక్కడా మెప్పిస్తుంది

సమీక్ష : “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” – అక్కడక్కడా మెప్పిస్తుంది

Published on Sep 17, 2022 3:03 AM IST
Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 16, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: సుధీర్ బాబు, కృతి శెట్టి, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, తదితరులు

దర్శకత్వం : మోహనకృష్ణ ఇంద్రగంటి

నిర్మాతలు: మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి

సంగీత దర్శకుడు: వివేక్ సాగర్

సినిమాటోగ్రఫీ: పి.జి.విందా

ఎడిటర్: మార్తాండ్. కె. వెంకటేష్

టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”. మరి డీసెంట్ ప్రమోషన్స్ లో ఈరోజు థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథ లోకి వచ్చినట్టు అయితే..నవీన్( సుధీర్ )బాబు సినీ ఇండస్ట్రీ లో ఓ యంగ్ హిట్ డైరెక్టర్ కాగా తాను సినిమా చెయ్యడానికి ఓ సరైన హీరోయిన్ కోసం చూస్తూ ఉంటాడు. దీనితో ఈ వేటలో ఓ డాక్టర్ అయినటువంటి అలేఖ్య (కృతి శెట్టి) నుంచి ఓ వీడియో చూసి అమితంగా ఇంప్రెస్ అవుతాడు. అక్కడ నుంచి ఆమెని హీరోయిన్ గా పెట్టి తన సినిమా చెయ్యాలని ఫిక్స్ అవుతాడు. మరి ఆమెతో తాను సినిమా చేస్తే ఎలా ఒప్పించి చేస్తాడు? ఈ ప్రపోజల్ కి అలేఖ్య కుటుంబం ఏం చెప్తారు? ఆమె ఎలా కన్విన్స్ అవుతుంది? ఈ సినిమా వల్ల ఆమెకి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? చివరికి వారి సినిమా ఏమవుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఇది వరకు దర్శకుడు మోహన్ కృష్ణ అలాగే సుధీర్ బాబు నుంచి వచ్చిన గత చిత్రాల్లో పర్ఫెక్ట్ డిజైన్ కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో కూడా మంచి పాత్రని ఇంద్రగంటి డిజైన్ చేశారు. దానిని అంతే ఫ్రెష్ గా హీరో సుధీర్ బాబు చేసాడు. సినిమాపై ప్యాషన్ కలిగిన ఓ స్టైలిష్ యంగ్ డైరెక్టర్ గా కనిపిస్తాడు.

అలాగే డైరెక్టర్ మార్క్ కొన్ని ఎమోషనల్ సీన్స్ లో తన సెటిల్డ్ పెర్ఫామెన్స్ బాగుంది. ఇక అలాగే సినిమాలో మెయిన్ పాత్రలో కనిపించే హీరోయిన్ కృతి శెట్టి తన గత చిత్రాలతో పోలిస్తే మంచి పాత్రలో కనిపిస్తుందని చెప్పాలి. మరి దీనిని కూడా ఆమె అంతే పర్ఫెక్ట్ గా తన నటనలో మరింత పరిపక్వతతో నటించింది అని చెప్పాలి.

అలాగే కొన్ని సెన్సిబుల్ ఎమోషన్స్ లో అలాగే మరికొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ లో సుధీర్ బాబుతో తన కెమిస్ట్రీ బాగుంది. అలాగే సినిమాలో ఎమోషన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే సీన్స్ అలాగే క్లైమాక్స్ కూడా మెప్పిస్తాయి. ఇంకా వెన్నెల కిషోర్ పై వచ్చే సన్నివేశాలు మంచి ఫన్ జెనరేట్ చేస్తాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడినట్టు అయితే ఇంద్రగంటి గత చిత్రాల్లానే ఓవరాల్ గా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ సినిమా అలా నెమ్మదిగా స్లో నరేషన్ లో కొనసాగుతునట్టు అనిపిస్తుంది. దీనితో అన్ని వర్గాల ఆడియెన్స్ కి సినిమా కనెక్ట్ అవుతుందని చెప్పలేం.

అలాగే మంచి మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించే వాళ్ళు కూడా ఈ సినిమా నుంచి పెద్దగా ఏమీ ఆశించకుండా ఉంటేనే మంచింది. ఇంకా వీటితో పాటు పలు సన్నివేశాల్లో అయితే అయితే కథనం కాస్త రొటీన్ గానే చాలా సాధారణంగా ఊహించే రేంజ్ లోనే ఉంటుంది. అలాగే మరీ అంత థ్రిల్ చేసేసే ట్విస్ట్ లు కూడా సినిమాలో పెద్దగా ఉండవు దీనితో సినిమా అంతా అలా ఫ్లాట్ గా కొనసాగిపోతుంది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ సినిమాలో బెంచ్ మార్క్ స్టూడియోస్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా చేశారు. ఇక టెక్నికల్ టీం లోకి వస్తే సంగీత దర్శకుడు వివేక్ సాగర్ సినిమాకి ప్రాణం పోసాడు. ఈ తరహా చిత్రాలకు ఒక సోల్ లాంటి మ్యూజిక్ తాను ఇస్తాడు అలాగే ఈ కాంబోలో మరోసారి మంచి మ్యూజిక్ ని అయితే తాను అందించాడు. అలాగే సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే డైలాగ్స్, ఎడిటింగ్ డీసెంట్ గా ఉన్నాయి.

ఇక దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి విషయానికి వస్తే తాను మరో డీసెంట్ సబ్జెక్ట్ తో వచ్చారని చెప్పాలి. పాత్రధారులకి మంచి రోల్స్ డిజైన్ చేసి వారి నుంచి మంచి నటనను కూడా తాను రాబట్టారు. ఇంకా డీసెంట్ ఎమోషన్స్, కాస్త స్లో అనిపించినా మంచి నరేషన్ తోనే సినిమాని చూడొచ్చు అనే రేంజ్ లో డిజైన్ చేశారు. ఓవరాల్ గా అయితే తన వర్క్ ఈ సినిమాకి బాగుంది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”, సుధీర్ బాబు మరియు మోహన్ కృష్ణ ఇంద్రగంటి నుంచి మరో సెన్సిబుల్ రొమాంటిక్ డ్రామా అని చెప్పాలి. సమ్మోహనం తర్వాత మరో క్లీన్ లైన్ తో డీసెంట్ డ్రామాలా ఈ సినిమా కనిపిస్తుంది. ఇక మెయిన్ లీడ్ అయితే తన పెర్ఫార్మన్స్ కెమిస్ట్రీ లతో డెఫినెట్ గా ఇంప్రెస్ చేస్తారు. అయితే స్లోగా సాగే నరేషన్, కొన్ని రొటీన్ అనిపించే సీన్స్, సినిమా నిడివి లాంటివి కాస్త బోర్ కలిగిస్తాయి. వీటితో కొంచెం తక్కువ అంచనాలు పెట్టుకొని చూస్తే ఈ సినిమా బెటర్ గా అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు