సమీక్ష : ఆకాశం – కొన్నిచోట్ల ఆకట్టుకునే స్లో ఎమోషనల్ డ్రామా !

సమీక్ష : ఆకాశం – కొన్నిచోట్ల ఆకట్టుకునే స్లో ఎమోషనల్ డ్రామా !

Published on Nov 5, 2022 3:01 AM IST
Aakasam Movie-Review-In-Telugu

విడుదల తేదీ : నవంబర్ 04, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: అశోక్ సెల్వన్, రీతూ వర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ తదితరులు

దర్శకుడు : రా కార్తీక్

నిర్మాత: వ‌యాకామ్ 18, రైజ్ ఈస్ట్ బ్యాన‌ర్

సంగీతం: గోపీసుందర్

సినిమాటోగ్రఫీ: విదు అయ్యన్న

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

 

అశోక్ సెల్వన్ హీరోగా రీతూ వర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ఆకాశం. ఈ సినిమాకి దర్శకత్వం రా కార్తీక్ వహించారు. ఈ ఎమోషనల్ ప్రేమ కథా చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

అశోక్ సెల్వన్ (అర్జున్) ఇంట్రోవర్ట్. పైగా ప్రతిదీ నీట్ గా పద్దతిగా ఉండాలని కోరుకుంటాడు. ప్రతి చిన్న విషయంలో పెద్దగా ఆలోచిస్తాడు. దీనికితోడు చిన్నతనం నుంచే బుక్స్ చదవడం బాగా అలవాటు. అలా చదివిన ప్రతి కథలోని ముఖ్య పాత్రలో తానే ఉన్నట్టు ఊహించుకుంటాడు. ఇలాంటి అశోక్ సెల్వన్ కి పెళ్లి కుదరడం, అంతలో అది ఆగిపోవడంతో డిప్రెషన్ కి గురి అవుతాడు. ఆ సమయంలో ఓ డాక్టర్ ఇచ్చిన రెండు డైరీలను చదువుతాడు. అందులో రెండు జంటలకు సంబంధించిన కథలు ఉంటాయి.

మొదటి కథలో.. వీర (అశోక్ సెల్వన్), మీనాక్షి ( శివాత్మిక రాజశేఖర్) కాలేజీలోనే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఇల్లు వదిలి అందరికీ దూరంగా వచ్చి లైఫ్ లీడ్ చేస్తుంటారు. అంతా హ్యాపీ అనుకుంటున్న సమయంలో వీర (అశోక్ సెల్వన్) కి ఓ ప్రమాదం జరుగుతుంది. ఆ తర్వాత ఏమైందో ఆ డైరీలో ఉండదు. ఇంతకీ వీర కు ఏమైంది ?, మీనాక్షి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ? అనేది ఈ కథలోని సస్పెన్స్.

ఇక రెండో కథ విషయానికి వస్తే.. అపర్ణ బాలమురళి (మది) ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని తన తండ్రి దగ్గర పట్టుదలగా ఉంటుంది. ఈ క్రమంలో పెళ్లి చూపుల నుంచి తప్పించుకోవడానికి ప్రతిసారి లేచి పోతూ ఉంటుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఆమెకు ప్రభాకర్ (అశోక్ సెల్వన్) పరిచయం అవుతాడు. ఆ పరిచయం పెళ్లికి దారి తీస్తోంది. ఐతే, ప్రభాకర్ తాళి కట్టే సమయానికి అపర్ణ బాలమురళి (మది) రక్తం కక్కుని పడిపోతుంది. అసలు మదికి ఏమైంది ?, చివరకు ఈ కథ ఎలా ముగింది ?,

ఇలా.. అశోక్ సెల్వన్ (అర్జున్) పై రెండు కథల ముగింపును కనుక్కోవడానికి జర్నీ స్టార్ట్ చేస్తాడు. మరి ఈ జర్నీలో అర్జున్ ఏం అర్థం చేసుకున్నాడు ?, అలాగే ఈ మధ్యలో అర్జున్ కి రీతూ వర్మ (సుభద్ర) తో ఎలా పరిచయం కలిగింది ? చివరకు అర్జున్ ఏం తెలుసుకున్నాడు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఆకాశం అంటూ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలతో వచ్చిన దర్శకుడు రా కార్తీక్, ఈ సినిమా క్లైమాక్స్ తో కాస్త కొత్తగానే ప్రయత్నం చేశాడు. ఇక ప్రధాన పాత్రలో నటించిన అశోక్ సెల్వన్ తన నటనతో ఆకట్టుకున్నాడు. మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించి.. ప్రతి పాత్రలో వేరియేషన్ చూపిస్తూ అశోక్ సెల్వన్ చాలా బాగా నటించాడు. హీరోయిన్స్ గా నటించిన రీతూ వర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ కూడా చాలా బాగా నటించారు.

అపర్ణ బాలమురళి తన లుక్స్ అండ్ యాక్టింగ్ పరంగా బాగా ఆకట్టుకుంది. రీతూ వర్మ ఈ సినిమాలో కొత్తగా కనిపించడానికి ఆమె బాగానే తాపత్రయ పడింది. శివాత్మిక రాజశేఖర్ కూడా తన పాత్రలో చాలా బాగా ఒదిగిపోయింది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాలు మరియు క్లైమాక్స్ ఆకట్టుకున్నాయి.

డాక్టర్ గా నటించిన నటి కూడా తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. సినిమాలో గోపీసుందర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి బాగా ప్లస్ అయింది.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు ‘రా కార్తీక్’ లైఫ్ లో తగిలే ఎదురుదెబ్బలకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు, కానీ.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేదు. అర్జున్ తన లైఫ్ ను పర్ఫెక్ట్ గా లీడ్ చేస్తూ కూడా.. ఎందుకు అంత వీక్ గా ఉన్నాడు అనే డౌట్ ప్రేక్షకులకు కలుగుతుంది. అర్జున్ క్యారెక్టర్ ను ఇంకా బలంగా రాసుకోవాల్సింది.

అలాగే, అర్జున్ – సుభద్ర మధ్య సాగే సీన్స్ కూడా స్లోగా సాగుతాయి. దీనికితోడు వారి మధ్య బాండింగ్ కి బలమైన సంఘర్షణ కూడా లేదు. ఇక మీనాక్షి – వీర లవ్ ట్రాక్ బాగున్నా.. వీరి మధ్య అనవసరమైన ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోయాయి. రెండో కథలో మది పాత్ర బాగున్నా.. ఆ ట్రాక్ మొత్తం స్లో నేరేషన్ తో బోరింగ్ ట్రీట్మెంట్ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కీలక సీన్స్ మరియు ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సీన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు.

ఇక సెకండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు కార్తీక్ బాగానే ప్రయత్నం చేశాడు, కొన్ని చోట్ల ఆ ఎమోషన్, ఆ ఫీల్ బాగానే వర్కౌట్ అయినా.. అవసరం లేని సీన్స్ కారణంగా సినిమాకి కొంత మైనస్ జరిగింది.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి చెప్పుకుంటే.. సంగీత దర్శకుడు గోపీసుందర్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ఫీల్ గుడ్ ట్యూన్స్ బాగున్నాయి. ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను ఎడిటర్ తన ఎడిటింగ్ తో మ్యానేజ్ చేయలేకపోయారు. విదు అయ్యన్న సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు కార్తీక్ తన దర్శకత్వంతో ఆకట్టుకున్నా.. ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను మాత్రం రాసుకోలేకపోయాడు. ఇక సినిమాలోని ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

తీర్పు :

ఎమోషనల్ లవ్ స్టోరీలతో వచ్చిన ఈ ‘ఆకాశం’లో లవ్ సీన్స్, ఎమోషనల్ గా సాగే ఫీల్ గుడ్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. కాకపోతే, స్లో నేరేషన్, కొన్ని చోట్ల బోరింగ్ ట్రీట్మెంట్, ఇంట్రెస్ట్ కలిగించలేని సన్నివేశాలు వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే, లవర్స్ కి ఈ సినిమాలోని కొన్ని అంశాలు నచ్చుతాయి. కానీ, మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు