విడుదల తేదీ : అక్టోబర్ 8, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: గోపీచంద్, నయనతార, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, చలపతి రావు తదితరులు
దర్శకుడు: బి. గోపాల్
నిర్మాతలు: తండ్ర రమేష్
సినిమాటోగ్రఫీ: బాల మురుగన్
సంగీత దర్శకుడు: మణిశర్మ
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
ఆరడుగుల బుల్లెట్ చిత్రం గత నాలుగు సంవత్సరాలుగా విడుదల కోసం ఎదురు చూస్తుంది. నేడు తాజాగా విడుదలైంది. అందుకు సంబంధించిన సమీక్ష ఎలా ఉందో చూద్దాం.
కథ:
శివ (గోపిచంద్) కేర్ లెస్ గా ఉంటూ, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునే యువకుడు. జీవితం లో ఎలాంటి గోల్ లేకుండా ఉండటం తో తన తండ్రి (ప్రకాష్ రాజ్) శివ ను ద్వేషిస్తూ ఉంటాడు. శివ నయనతార తో ప్రేమలో పడటం జరుగుతుంది. అన్ని విషయాలు ఒకే అనుకున్న సమయానికి శివ తండ్రి భూమిని ఒక డాన్ (అభిమన్యు సింగ్) లాక్కుంటాడు. ఈ సమస్యలను శివ ఎలా ఎదుర్కొంటాడు, ఆస్తిని ఎలా కాపాడుకుంటాడు, తన తండ్రిని ఎలా గెలుచుకున్నాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
గోపీచంద్ ఈ పాత్ర కి చాలా పర్ఫెక్ట్ గా సరిపోయాడు. యువకుడు గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటాడు. పోరాట సన్నివేశాల్లో గోపి చంద్ చాలా అద్భుతంగా చేశాడు. బీ గోపాల్ వీటిని చాలా బాగా చూపించారు. ఈ చిత్రం లో నయనతార చాలా అందం గా ఉంది. గోపీచంద్ తో చేసే సన్నివేశాల్లో కెమిస్ట్రీ వర్కౌట్ అయింది అని చెప్పాలి.
ప్రకాష్ రాజ్ ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించారు. ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. తండ్రి మరియు కొడుకుల మధ్యన ఉండే అపార్థం ను చాలా బాగా చూపించ బడటం జరిగింది.
మొదటి భాగం అంతా కూడా చాలా చక్కగా చూపబడింది. రొమాన్స్, డ్రామా, కుటుంబం లో ఉండే భావోద్వేగాలు చూపించడం జరిగింది. ఈ చిత్రం లో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం తో పాటుగా దివంగత నటులు ఎం ఎస్ నారాయణ మరియు జయ ప్రకాష్ రెడ్డి కూడా ఉన్నారు.
మైనస్ పాయింట్స్:
విలన్ ఈ చిత్రం లో చాలా బలహీనంగా చూపించడం జరిగింది. అంతేకాక అంత ఇంపాక్ట్ కూడా చూపించ లేదు అని చెప్పాలి. ఈ చిత్రం లో మేజర్ మైనస్ పాయింట్ ఎంటి అంటే మొదటి భాగం లోనే సినిమా అంతటినీ చూపించడం జరిగింది. రెండవ భాగం లో చెప్పడానికి అంతగా ఏమీలేదు.
ఇన్నేళ్లుగా సినిమా విడుదల కాలేదు. అంతేకాక సినిమా బ్యాక్ డ్రాప్, కథ, ఎమోషన్స్ అన్ని కూడా ఔట్ డేటెడ్ గా ఉంటాయి. తండ్రి మరియు కొడుకుల మధ్యన ఉండే ద్వేషాన్ని చాలా సినిమాల్లో మనం చూసే ఉంటాం.
సాంకేతిక విభాగం:
సినిమా నిర్మాణ విలువలు చాలా బావున్నాయి కెమెరా పనితనం చాలా బాగుంది. ఈ సినిమాలో కనల్ కన్నన్ యాక్షన్ పార్ట్ చాలా బాగుంది. ఎందుకంటే ఫైట్స్ చాలా బాగా కంపోజ్ చేయబడ్డాయి. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం చాలా బావుంది, తెర పై చూడటానికి ఇంకా బావున్నాయి. దర్శకుడు పనితనం పర్వాలేదు అనిపిస్తుంది. కథను చెప్పే విధానం అంతగా ఆకట్టుకోదు, అంతేకాక సెకండ్ హాఫ్ చాలా బోరింగ్ గా, రొటీన్ గా ఉంటుంది.
తీర్పు:
మొత్తం మీద ఆరడుగుల బుల్లెట్ ఒక రొటీన్ యాక్షన్ డ్రామా, మొదటి భాగం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఎమోషన్స్ సన్నివేశాల తో అంతగా ఆకట్టుకొనే విధంగా ఉండదు. మంచి యాక్షన్ సన్నివేశాలను కలిగి ఉన్న ఈ చిత్రం ఈ వారాంతం డల్ వాచ్ అవుతుంది అని చెప్పాలి.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team
Click Here For English Version