ఓటిటి సమీక్ష: ప్రైమ్ వీడియోలో ఫాహద్ ఫాసిల్ నటించిన మలయాళ చిత్రం ఆవేశం

ఓటిటి సమీక్ష: ప్రైమ్ వీడియోలో ఫాహద్ ఫాసిల్ నటించిన మలయాళ చిత్రం ఆవేశం

Published on May 12, 2024 10:40 PM IST
Aavesham Movie Review in Telugu

విడుదల తేదీ : మే 09, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: ఫాహద్ ఫాసిల్, మిథున్ జై శంకర్, హిప్‌స్టర్, రోషన్ షానవాజ్, సజిన్ గోపు, మన్సూర్ అలీ ఖాన్

దర్శకుడు: జిత్తు మాధవన్

నిర్మాతలు: నజ్రియా నజీమ్, అన్వర్ రషీద్

సంగీత దర్శకుడు: సుశీన్ శ్యామ్

సినిమాటోగ్రఫీ: సమీర్ తాహిర్

ఎడిటింగ్: వివేక్ హర్షన్

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఫాహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో, జిత్తు మాధవన్ దర్శకత్వం వహించిన ఆవేశం చిత్రం ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

కథ:

కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చేరారు. కాలేజ్ లో ఉన్న సీనియర్లు వీరిని బాగా కొడతారు. ఇందుకు ముగ్గురూ వారికి బుద్ధి చెప్పాలని ప్లాన్ చేస్తారు. స్థానికుల మద్దతు తమ సీనియర్లపై ప్రతీకారం తీర్చుకోవడానికి సహాయపడుతుందని అజు అభిప్రాయపడ్డాడు. త్వరలో వారు స్థానిక గ్యాంగ్‌స్టర్ అయిన రంగా (ఫాహద్ ఫాసిల్)తో స్నేహం చేస్తారు. రంగాతో సాహచర్యం బీబీ, అజు, శంతన్‌ల జీవితాలను ఎలా ప్రభావితం చేసింది అనేది సినిమా.

ప్లస్ పాయింట్స్:

కొన్ని సినిమాలు ప్రధాన నటుడి పాత్రపై ఎక్కువగా ఆధారపడతాయి. ఆవేశం చిత్రం ఈ కోవలోకి వస్తుంది. దర్శకుడు జిత్తు మాధవన్ ఇటీవలి కాలంలో ఓ మాంచి క్రేజీ క్యారెక్టరైజేషన్‌ ను సృష్టించాడు. అందుకోసం అతను ఫాహద్ ఫాసిల్‌ను ఎంచుకున్నాడు.

మలయాళీ నటుడు తన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాలో ఫాహద్ ఏం చేసినా చాలా వినోదభరితంగా ఉంటుంది. అతని కామెడీ టైమింగ్ అలరిస్తుంది. రంగా పాత్రలో మరెవరినీ ఊహించుకోలేనంతగా నటుడి నటన బాగుంది.

మిథున్‌ జై శంకర్‌, హిప్‌స్టర్‌, రోషన్‌ షానవాజ్‌ తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. ముగ్గురూ ఫాహద్ ఫాసిల్ సామర్థ్యాన్ని అనుమానించారు. గూండాలు అతని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారని నమ్ముతారు. ఈ సన్నివేశాలు మన మనస్సులలో సందేహాన్ని కలిగిస్తాయి. సినిమాను ఆసక్తికరంగా మార్చాయి. ఒకరకంగా చెప్పాలంటే ఈ యాక్షన్ కామెడీలో దర్శకుడు సస్పెన్స్ ఎలిమెంట్ క్రియేట్ చేసాడు.

రెండు భాగాలలో వచ్చే సన్నివేశాలు చాలా ఎంటర్ టైనింగ్ గా సాగాయి. సరదా సన్నివేశాలు బాగా అలరించాయి. చివర్లో వచ్చే ఎమోషనల్ మూమెంట్స్ ని డైరెక్టర్ చాలా చక్కగా హ్యాండిల్ చేశారు.

మైనస్ పాయింట్స్:

ఇంతకు ముందు చెప్పినట్లుగా, ఈ చిత్రం కథానాయకుడి క్యారెక్టరైజేషన్ గురించి మరియు చాలా సన్నని ప్లాట్‌తో ఉంటుంది. సినిమాలో సాలిడ్ కంటెంట్‌ని ఆశించేవారు కాస్త నిరాశ చెందవచ్చు. పాత్రల గురించి పూర్తిగా తెలియడానికి చాలా టైమ్ పడుతుంది.

సెకండాఫ్‌లోని కొన్ని సన్నివేశాలు స్లోగా సాగుతాయి. కొన్ని అనవసర సన్నివేశాలను ఎడిట్ చేసి ఉండవచ్చు. మన్సూర్ అలీ ఖాన్ పాత్రకు మరింత డెప్త్ అవసరం. స్క్రీన్ ప్లే సమస్య కారణంగా, నటుడు ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు.

సాంకేతిక విభాగం:

సుశిన్ శ్యామ్ పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా థీమ్ కి తగ్గట్టుగా ఉన్నాయి. సమీర్ తాహిర్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఫైట్ సీక్వెన్స్‌లు అద్భుతంగా తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్ గా ఉన్నాయి, కానీ ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది.

జిత్తు మాధవన్ ఆడియెన్స్ ను ఎంగేజ్ చేయడం లో సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. వినోదాత్మక క్షణాలను అందించడం ద్వారా సినిమాను చక్కగా హ్యాండిల్ చేశారు. రంగా పాత్ర కోసం దర్శకుడు ఫాహద్ ఫాసిల్‌ను ఎంచుకోవడంతో సగం సినిమా హిట్ అయ్యింది అని చెప్పాలి. నటుడు తన నటనతో సినిమాను సరికొత్త స్థాయికి తీసుకెళ్లాడు.

తీర్పు:

మొత్తం మీద, ఆవేశం చిత్రం ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ లో ఫాహద్ ఫాసిల్ నటన చాలా బాగుంది. నటుడు తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అలరించాడు. ఈ చిత్రం సన్నని ప్లాట్‌ను కలిగి ఉంది. సెకండాఫ్‌లో స్క్రీన్ ప్లే నెమ్మదిగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉండే అవకాశం ఉంది. కానీ సినిమాలో అలరించే అధ్బుతమైన సన్నివేశాలు ఈ లోపాలను అధిగమించాయి. ఈ వీకెండ్ సినిమాను ఆస్వాదించవచ్చు.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు