విడుదల తేదీ : నవంబర్ 19, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: తేజ సజ్జ, శివాని రాజశేఖర్, తులసి
దర్శకత్వం : మల్లిక్ రామ్
నిర్మాతలు: మందవ సాయి కుమార్, చంద్ర శేఖర్ మొగుళ్ల, సృజన్ యరబోలు
సంగీత దర్శకుడు: రాధన్
సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్ చింత
ఎడిటింగ్: గ్యారీ బి
ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయ్యినప్పటికీ కొన్ని చిత్రాలు పలు కారణాల చేత ఓటిటిలోనే రిలీజ్ అవుతున్నాయి. అలా యంగ్ హీరో తేజ సజ్జ నటించిన చిత్రం “అద్భుతం” ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ :
కథలోకి వచ్చినట్టు అయితే సూర్య(తేజా సజ్జ) తన లైఫ్ పై ఆసక్తి లేక ఆత్మ చచ్చిపోదాం అని ఫిక్స్ అవుతాడు. మరి ఇదే సమయంలో తన చావుకి ఎవరూ కూడా భాద్యులు కాదు అని తన నెంబర్ కే ఒక మెసేజ్ పెట్టుకుంటాడు. కానీ ఆశ్చర్యకరంగా ఈ మెసేజ్ 2014 లోని వెన్నెల(శివాని రాజశేఖర్) అనే అమ్మాయికి చేరుతుంది. ఆమెది సూర్య నెంబర్ నే.. ఇలా తన నెంబర్ ఇంకొకరి దగ్గర ఉండడం ఏమిటి? అందులోని వేరే సంవత్సరం! ఇక ఇక్కడ నుంచి వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ స్టార్ట్ అవుతుంది? రెండు భిన్నమైన కాలాల మధ్య ఉండే వీరు కలుసుకుంటారా అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే హాట్ స్టార్ లో ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
జెనరల్ గా టైం బేస్డ్ సినిమాలు అంటేనే ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. అలానే ఈ సినిమాలో కూడా కొంత వరకు అలా మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. అలాగే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే తేజ సజ్జ కి హీరోగా ఇదే మొదటి చిత్రం. అయినా కూడా తన ఫస్ట్ సినిమాకే తన లోని బెస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు. మంచి నటనతో పాటుగా తన లుక్స్ కానీ, డైలాగ్ మాడ్యులేషన్స్ కానీ ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో తన నటన అన్నీ బాగున్నాయి. హీరోగా ఫస్ట్ సినిమాకి ఎలాంటి బెరుకు లేకుండా తన పెర్ఫామ్ చెయ్యడం హర్షణీయం.
ఇక హీరోయిన్ శివానీ విషయానికి వస్తే ఓ హోమ్లీ అమ్మాయిగా డీసెంట్ గా కనిపించింది. అలాగే మంచి సెటిల్డ్ పెర్ఫామెన్స్ ని కూడా ఆమె కనబరిచింది. ఇంకా సినిమాలో నటుడు శివాజీ రాజా అలాగే కమెడియన్ సత్య లు తమ పాత్రల మేరకు మంచి నటనను కనబరిచారు. ఇంకా సినిమాలో ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు మెయిన్ లీడ్ మధ్య కనిపించే సీన్స్ ప్రాసెస్ కూడా ఇంప్రెసివ్ గా ఉంటుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ లైన్ కనిపిస్తుంది. కానీ దానిని అనవసర సుత్తితో పాడు చేసినట్టు అనిపిస్తుంది. టైం బేస్డ్ గా నడిచే సినిమాలు చాలా ఆసక్తిగా అనిపిస్తాయి. వాటికి సరైన కథనం ఇంట్రెస్టింగ్ గా అనిపించే సీన్స్ పెడితేనే చూసే ప్రేక్షకుడికి కాస్త ఎంగేజింగ్ గా ఉంటుంది.
కానీ దానిని ఈ సినిమాలో లవ్ స్టోరీ పైనే సీన్స్ ఎక్కువ పెట్టడం వల్ల ఆసక్తి తగ్గుతుంది. అలాగే సినిమాలో సరైన ఎమోషన్ కూడా ఎక్కడా కనిపించదు. జస్ట్ అలా సినిమా కథనం నడుస్తుంది అంతే సినిమా లైన్ కి తగ్గట్టుగా ఇంకా మంచి సన్నివేశాలు యాడ్ చెయ్యాల్సి ఉన్నా అలాంటివి అంతగా కనిపించవు.
సాంకేతిక వర్గం :
ఈ చిత్రం అంతా కూడా ఎపుడో 2016లోనే కంప్లీట్ అయ్యింది. కానీ అప్పుడుకి తగ్గట్టుగానే నిర్మాతలు సినిమా పట్ల ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు, మంచి నిర్మాణ విలువలు ఈ చిత్రంలో కనిపిస్తాయి. అలాగే టెక్నికల్ టీం లో మ్యూజిక్ వర్క్, సినిమాటోగ్రఫీ లు బావున్నాయి. కానీ ఎడిటింగ్ బెటర్ చెయ్యాల్సింది.
ఇక దర్శకుడు మాలిక్ రామ్ విషయానికి వస్తే తన వర్క్ పర్వాలేదు. అప్పటికి తాను ఎంచుకున్న కాన్సెప్ట్ నిజంగా బాగుంది అని చెప్పాలి. కానీ దానిని ఎంగేజింగ్ అంశాలతో ప్రెజెంట్ చేసి ఉంటే తన కాన్సెప్ట్ కి న్యాయం చేసి ఉండేవారు. ఊహించదగ్గ సన్నివేశాలు డల్ నరేషన్ తో దెబ్బ తీశారు.
తీర్పు :
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “అద్భుతం” లో మొదటగా సినిమా ప్రొసీడింగ్ లో కాన్సెప్ట్ ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది. అలాగే ప్రధాన పాత్రధారులలో తేజ డెఫినెట్ గా ఇంప్రెస్ చేస్తాడు. కాకాపోతే సినిమాలో సరైన ఎమోషన్స్, మంచి సన్నివేశాలు కథనం లేవు. ఓవరాల్ గా అయితే టైం లైన్ తో లవ్ స్టోరీ ఇష్టపడే వాళ్ళు అయితే ఈ సినిమా ఈ వీకెండ్ లో మంచి ఛాయిస్ గా చూడొచ్చు..
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team