సమీక్ష : అదుగో – విసిగించిన బంటి

సమీక్ష : అదుగో – విసిగించిన బంటి

Published on Nov 8, 2018 4:01 AM IST
Adhugo movie review

విడుదల తేదీ : నవంబర్ 07, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

నటీనటులు : బంటి, అభిషేక్ వర్మ, నాభ నటేష్ , రవి బాబు తదితరులు

దర్శకత్వం : రవిబాబు

నిర్మాత : రవిబాబు , సురేష్ ప్రొడక్షన్స్

సంగీతం : ప్రశాంత్ విహారి

స్క్రీన్ ప్లే : రవిబాబు

దర్శకడు రవిబాబు తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం ‘అదుగో’. అభిషేక్ వర్మ, నాభ నటేష్ జంటగా నటించిన ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందోసమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

బంటి (పందిపిల్ల) ఒక తప్పుడు కొరియర్ ద్వారా హీరో (అభిషేక్ వర్మ) దగ్గరకి చేరుతుంది. అది పంది పిల్ల అని తెలియక, అభిషేక్ వర్మ దాన్ని తన లవర్ నాభా నటేష్ కి ప్రెజెంట్ చేస్తాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య.. బంటి, సిక్స్ ప్యాక్ శంకర్ (రవిబాబు)కు మరియు మరికొన్ని గ్యాంగ్ లకు అత్యవసరంగా కావాల్సి వస్తోంది.

దాంతో సిక్స్ ప్యాక్ శంకర్ తో సహా మిగిలిన గ్యాంగ్ లందరూ బంటిని పట్టుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాల్లో బంటికి ఎలాంటి సమస్యలు వచ్చాయి ? ఆ గ్యాంగ్ లు నుండి బంటి ఎలా తప్పించుకుంది ? చివరకి తనని పెంచుకున్న పిల్లాడి దగ్గరకి బంటి ఎలా చేరింది ? ఈ క్రమంలో హీరోకి వచ్చిన సమస్యలు ఏమిటి ? ఫైనల్ గా హీరో తన లవర్ ని దక్కించుకున్నాడా ? లేదా ? లాంటి విషయాలు తెలయాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన బంటి (పంది పిల్ల) సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్యాంగ్ లు నుంచి తప్పించుకున్నే సన్నివేశాల్లో.. రౌడీలతో ఫైట్ చేసే సన్నివేశాల్లో బంటి బాగా అలరిస్తోంది. ఇక హీరోగా నటించిన అభిషేక్ వర్మ ఎలాంటి తడబాటు, బెఱుకు లేకుండా చాలా చక్కగా కాన్ఫిడెంట్ గా నటించాడు.

హీరోయిన్ గా నాభ నటేష్ తన నటనతో పాటు తన గ్లామర్ తోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా మొదటి పాటలో తన లవర్ గురించి చెప్పే షాట్స్ లో ఆమె హావభావాలు ఆకట్టుకుంటాయి.

సిక్స్ ప్యాక్ శక్తిగా నటించిన రవిబాబు తన కామెడీ టైమింగ్‌ తో అక్కడక్కడా నవ్విస్తూనే.. ఇటు మర్డర్స్ చేస్తూ.. కథలో సీరియస్ నెస్ తీసుకొచ్చారు. బంటిని పెంచుకునే పిల్లాడి పాత్రలో నటించిన అబ్బాయి కూడా చాలా బాగా నటించాడు. బంటి కోసం ఆ పిల్లాడు పడే బాధ.. ఆ పిల్లాడి కోసం బంటి పడే తపన కాస్త ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడంతో పాటు సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.

 

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో చెప్పుకోవడానికి చాలా క్యారెక్టర్స్ చాలా ప్లాట్ పాయింట్స్ ఉన్నాయి కానీ.. ఏది ఆసక్తికరంగా సాగదు. కొన్ని సన్నివేశాల్లో అయితే దర్శకుడు తనకు తోచినట్లు రాసుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోయాడా అన్న ఫీలింగ్ కలుగుతుంది.

ఫస్ట్ హాఫ్ లో చాలా భాగం సినిమాలోని పాత్రలను పరిచయం చెయ్యడానికే ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు.. ఆ తరువాత కూడా ప్లో లేని సీన్లతో, అలరించని కామెడీతో సినిమాని నడిపాడు.

పైగా పాత కాలపు మిస్ అండర్ స్టాడింగ్ కామెడీతో, కన్విన్స్ కాని మరియు లాజిక్ లేని సీన్స్ తో నవ్వించడానికి శతవిధాలా ప్రయత్నం చేసినప్పటికీ.. ప్రేక్షకులు మాత్రం మనస్ఫూర్తిగా నాలుగుసార్లు కూడా నవ్వుకోరు.

సినిమాలో అవసరానికి మించి పాత్రలు ఉన్నాయి, దాంతో ప్రేక్షకుడు ఏ పాత్రతోనూ కనెక్ట్ కాలేడు. దీనికి తోడు దర్శకుడు ఉన్న కంటెంట్ ను కూడా పూర్తిగా వాడుకోలేదు. కథ కథనం కూడా ఆసక్తికరంగా సాగదు. పైగా బంటి – పిల్లాడి మధ్య ఉన్న ఎమోషనల్ కంటెంట్ ఇంకా బాగా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా.. అది కూడా సరిగ్గా ఎలివేట్ అవ్వలేదు.

 

సాంకేతిక విభాగం :

దర్శకుడు రవిబాబు పేపర్ మీద రాసిన స్క్రిప్ట్, స్క్రీన్ మీద ఆయన విజన్ కి తగ్గట్లు సరిగ్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. పైగా ఆయన రాసుకున్న కథకథనాల్లో సహజత్వం కూడా లోపించింది. సుధాకర్ రెడ్డి కెమెరా పనితనం కొన్ని సన్నివేశాలల్లో పర్వాలేదనిపిస్తుంది.

ప్రశాంత్ విహారి అందించిన పాటల్లో పూర్ణ పాట ఆకట్టుకుంటుంది. ఆయన అందించిన నేపధ్య సంగీతం సినిమాకి తగ్గట్లు సాగింది. ఎడిటర్, దర్శకుడు అభిరుచికి తగ్గట్లే ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. కథకు తగ్గట్లుగానే నిర్మాణ విలువలు ఉన్నాయి.

 

తీర్పు :

దర్శకడు రవిబాబు దర్శకత్వంలో అభిషేక్ వర్మ, నాభ నటేష్ జంటగా నటించిన ఈ చిత్రం ఆకట్టుకునే విధంగా లేదు. బంటి (పంది పిల్ల) సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన్నప్పటికీ.. గ్యాంగ్ లు నుంచి తప్పించుకునే సన్నివేశాల్లో.. రౌడీలతో ఫైట్ చేసే సన్నివేశాల్లో బంటి బాగానే అలరిచిన్నప్పటికీ.. కన్వీన్స్ కానీ ట్రీట్మెంట్ మరియు గ్యాంగ్ లు మధ్య పండని మిస్ అండర్ స్టాడింగ్ కామెడీ, అలాగే లాజిక్ లేని సీన్స్ తో ఆసక్తికరంగా సాగని కథనం లాంటి కొన్ని అంశాలు కారణంగా ఈ సినిమా ఫలితం దెబ్బ తింది. ఓవరాల్ గా సినిమాలోని చాలా సన్నివేశాలు మరీ నాటకీయంగా గందరగోళంగా ఉండటంతో ఈ సినిమా మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకోదు.

 

123telugu.com Rating : 1.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు