ఓటిటి సమీక్ష : “అహ నా పెళ్ళంట” – తెలుగు సిరీస్ జీ 5 లో

ఓటిటి సమీక్ష : “అహ నా పెళ్ళంట” – తెలుగు సిరీస్ జీ 5 లో

Published on Nov 17, 2022 5:22 PM IST
Aha Na Pellanta Movie Review

విడుదల తేదీ : నవంబర్ 17, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్, హర్షవర్ధన్, ఆమని, పోసాని కృష్ణ మురళి, గెటప్ శ్రీను, తాగుబోతు రమేష్

దర్శకుడు : సంజీవ్ రెడ్డి

నిర్మాత: సూర్య రాహుల్ తమడ

సంగీత దర్శకులు: జుడః సాండీ

సినిమాటోగ్రఫీ: నగేష్ బన్నెల్, అక్షర్ అలీ

ఎడిటర్: మధు రెడ్డి

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

లేటెస్ట్ గా ఓటిటిలో కూడా నాన్ స్టాప్ లో ఏదొక కంటెంట్ రిలీజ్ అవుతూనే ఉంది. మరి అలా ప్రముఖ ఓటిటి యాప్ జీ 5 లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఇంట్రెస్టింగ్ సిరీస్ “అహ నా పెళ్ళంట”. యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది కావడంతో మంచి బజ్ నెలకొంది. ఇక ఈరోజు నుంచి స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సిరీస్ అయితే ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

ఇక కథలోకి వస్తే.. శీను(రాజ్ తరుణ్) తన చిన్నప్పుడు నుంచే తన ప్రేమ, పెళ్లి అంటూ తన తల్లిదండ్రులు నో బాల్ నారాయణ(హర్షవర్ధన్) అలాగే సుశీల(ఆమణిలకు) షాకిస్తూ ఉంటాడు. అయితే కొన్నాళ్ళకి తన కి పెళ్లి ఏజ్ వచ్చేసరికి తన పెళ్లి ఫిక్స్ అవుతుంది. కానీ అమ్మాయి ఊహించని విధంగా సరిగ్గా పెళ్ళికి ముందు ఆ పెళ్లి చేసుకోకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక ఈ తర్వాత శీను కూడా క్రికెట్ అకాడమీలో జాబ్ కోసం వెళ్తాడు. అక్కడ ఆ పెళ్లి కూతరు తండ్రి మహేంద్ర(పోసాని కృష్ణ మురళి) అసలు నిజాన్ని అతనికి చెప్తాడు. మరి తాను చెప్పిన నిజం ఏంటి? ఆమె మహా(శివానీ రాజశేఖర్) ఎందుకు వెళ్ళిపోయింది? ఆమె వల్ల శీను లైఫ్ లో వచ్చిన మార్పులు ఏంటో తెలియాలి అంటే ఈ సిరీస్ ని జీ 5 లో వీక్షించాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సిరీస్ ల చాలా అంశాలు చూసే వీక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పాలి. నటీ నటుల నటన నుంచి వారి పాత్రల డిజైన్ వాటిలో ఎమోషన్స్ మరియు డీటెయిల్స్ బాగా కనిపిస్తాయి. మొదటగా రాజ్ తరుణ్ ని తన ఓటిటి డెబ్యూ గా మంచి కంటెంట్ ని ఎంచుకోవడంలో మెచ్చుకోవాలి. అలాగే ఈ సిరీస్ లో తన సినిమాలను మించిన నటన అలాగే ఎమోషన్స్ ని తాను పండించి ఆకట్టుకున్నాడు.

అలాగే వీటితో పాటుగా తనలోకి కామికల్ యాంగిల్ కూడా చాలా బాగా అనిపించింది. అలాగే ఈ సిరీస్ లో కూడా మంచి యంగ్ గా కనిపించి మరింత క్లీన్ నెస్ ని కనబరిచాడు. ఇక తనతో పాటుగా యంగ్ హీరోయిన్ శివాని కూడా మంచి పాత్రలో కనిపిస్తుంది. అలాగే ఆమె పాత్రని డిజైన్ చేసిన విధానం కూడా మెప్పించే విధంగా ఉంది. అలాగే దీనిలో ఆమె అద్భుతమైన పెర్ఫామెన్స్ ని కనబరిచింది అని కూడా చెప్పాలి.

డెఫినెట్ గా తన కెరీర్ లో నటన పరంగా ఈ పాత్ర కూడా ఒక బెస్ట్ రోల్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. ఇంకా ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. అలాగే సిరీస్ లో అన్ని ఎమోషన్స్ తో పాటుగా మంచి కామెడీ కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా హర్షవర్ధన్ పై సీన్స్ బాగుంటాయి. అలాగే గెటప్ శ్రీను, తాగుబోతు రమేష్ లపై వచ్చే సీన్స్ కూడా మంచి హిలేరియస్ గా అనిపిస్తాయి. అలాగే ఆమని, పోసాని తదితరులు తమ పాత్రల్లో మెప్పిస్తారు. అలాగే సిరీస్ లో ఎపిసోడ్స్ ని కూడా క్రిస్ప్ గా కట్ చెయ్యడం మరో అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు.

 

మైనస్ పాయింట్స్ :

ఈ సిరీస్ లో కొన్ని అంశాలు ఎంత బాగుంటాయో కొన్ని అంశాలు అదే విధంగా క్లారిటీ లేకుండా ఉన్నట్టు అనిపిస్తాయి. సిరీస్ మెయిన్ ప్లాట్ లోకి వెళ్ళడానికి సమయం తీసుకోవడం స్టార్టింగ్ నుంచే అంత ఎంగేజింగ్ గా ఉండకపోవడం అనేది కాస్త డల్ గా అనిపిస్తుంది. అలాగే చాలా చోట్ల నరేషన్ ఊహించదగిన విధంగానే అనిపిస్తుంది.

దీనితో అంత కొత్తదనం కనిపించదు. అలాగే ఇలాంటి సిరీస్ లలో పాటలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి కానీ అంత ఎఫెక్టీవ్ గా అయితే సిరీస్ లో పాటలు ఉండవు. అలాగే పలు సన్నివేశాల్లో ఇంకా బెటర్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. వీటితో పాటుగా క్లైమాక్స్ ని కూడా బాగా డిజైన్ చేసినట్టు అయితే బాగుండేది.

 

సాంకేతిక విభాగం :

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సిరీస్ నేపథ్యానికి తగ్గట్టుగా చేసిన సెటప్ అంతా ఖర్చుకి వెనకాడకుండా డిజైన్ చేశారు. ఇక టెక్నీకల్ టీం లో మ్యూజిక్ బాగుంది సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అయితే ఎడిటింగ్ కొన్ని చోట్ల బెటర్ గా చేయాల్సి ఉంది. మిగతా అంతా నీట్ గా ఉంది. అలాగే డైలాగ్స్, కాస్ట్యూమ్స్ కూడా బాగున్నాయి.

ఇక దర్శకుడు సంజీవ్ రెడ్డి విషయానికి వస్తే కాస్త రొటీన్ లైన్ నే తీసుకున్నా చాలా వరకు మంచి నరేషన్ ని అందించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కాకపోతే ఇంకా పలు చోట్ల సన్నివేశాలు బెటర్ గా చెయ్యాల్సి ఉంది. అయితే తాను చెప్పాలి అనుకున్న పాయింట్ ని ఆల్ మోస్ట్ మెప్పించే విధంగా చెప్పాడని చెప్పొచ్చు.

 

తీర్పు :

ఇక ఫైనల్ గా చూసినట్టు అయితే ఈ “అహ నా పెళ్ళంట” సిరీస్ తో అయితే హీరో రాజ్ తరుణ్ మంచి డెబ్యూ ఇచ్చాడని చెప్పొచ్చు. తాను సహా నటి శివాని రాజశేఖర్ పెర్ఫామెన్స్ లు మంచి ప్రామిసింగ్ గా ఉండగా కొన్ని అంశాలు మినహా ఈ సిరీస్ దాదాపు ఎంగేజింగ్ గా మంచి ఎమోషన్స్ మరియు ఎంటర్టైన్మెంట్ తో సాగుతుంది. దీనితో అయితే ఈ వారాంతానికి వీలు చూసుకుని వీక్షకులు జీ 5 లో ఈ సిరీస్ తప్పకుండా చూడొచ్చు.

 

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు