![Akhanda Movie Review In Telugu](https://cdn.123telugu.com/telugu/wp-content/uploads/2021/12/Akhanda-review.jpg)
విడుదల తేదీ : డిసెంబర్ 02, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు, శ్రీకాంత్, అవినాష్, పూర్ణ, సుబ్బరాజు
దర్శకత్వం : బోయపాటి శ్రీను
నిర్మాతలు: మిర్యాల రవీందర్‌రెడ్డి
సంగీత దర్శకుడు: తమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్
ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వరరావు
ఈ ఏడాదిలో టాలీవుడ్ మరో బిగ్గెస్ట్ రిలీజ్ ఈరోజు అయ్యింది. నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కించిన హ్యాట్రిక్ సినిమా “అఖండ”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకునే రీతిలో ఉందా లేదా అనేది సమీక్షలో పరిశీలిద్దాం రండి.
కథ :
ఇక కథలోకి వచ్చినట్టు అయితే.. అనంతపూర్ లోని బాగా పేరున్న గొప్ప వ్యక్తి మురళీ కృష్ణ(బాల కృష్ణ). అయితే ఇదే ప్రాంతంలో వరద రాజులు(శ్రీకాంత్) కి చెందిన ఓ మైన్ తో పరిస్థితులు అన్నీ ఒక్కసారిగా హీట్ అవుతాయి. దీనితో మురళీ కృష్ణ వరదరాజులికి అడ్డుగా నిలబడినా తానే అనూహ్యంగా అరెస్ట్ అవుతాడు. మరి ఈ క్లిష్ట పరిస్థితిలో అఖండ(అఘోర గా మరో బాలకృష్ణ) ఎంటర్ అవుతాడు. ఇక ఇక్కడ నుంచి అఖండ చేసినది ఏమిటి? మురళీ కృష్ణ కి అఖండ కి ఏమన్నా సంబంధం ఉందా? ఉంటే ఎలాంటిది? అసలు ఈ అఖండ ఎవరు? ఇద్దరూ కలుసుకుంటారా? వరదరాజులు ని ఎలా ఎదుర్కొంటారు అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
బాలయ్య బోయపాటి కాంబో అనగానే మొదట గుర్తుకొచ్చే పదం ‘మాస్’. మరి అంశాలను ఆశించి సినిమాకి వెళ్లిన వారిని మాత్రం ఈ సెన్సేషనల్ కాంబో ఒక్క ఇంచ్ కూడా కిందకి దించరు. బాలయ్య ని బోయపాటి చూపించిన నెక్స్ట్ లెవెల్ మాస్ ప్రెజెంటేషన్ లో తనకి తానే సాటి అని మళ్ళీ ప్రూవ్ చేశారు. రెండు వేరియేషన్ లో కూడా బాలయ్య లోని మాస్ విశ్వరూపం దేనికదే డిఫరెంట్ గా సాలిడ్ ట్రీట్ ని అందిస్తుంది.
ఏ సమయానికి తగ్గట్టుగా ఎక్కడికక్కడ బాలయ్య ని ఎలివేట్ చేసిన ప్రతీ సీన్ కూడా మంచి ట్రీట్ ఇస్తుంది. ముఖ్యంగా బాలయ్య అఘోర గెటప్ లో ఎంటర్ అయ్యాక సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది. అందులో బాలయ్య లుక్స్ కానీ పవర్ ఫుల్ డైలాగ్స్ కానీ సూపర్బ్ గా అనిపిస్తాయి.. అలాగే వీటితో పాటు పలు ఎమోషనల్ సీన్స్ లో బాలయ్య హావభావాలు హత్తుకునేలా కనిపిస్తాయి. ఇంకా సాంగ్స్ లో కానీ యాక్షన్ సీన్స్ లో కానీ తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ సాలిడ్ ట్రీట్ ని ఇస్తుంది.
ఇక అలాగే చాలా కాలం తర్వాత మళ్ళీ విలన్ గా కనిపించిన సీనియర్ నటుడు శ్రీకాంత్ నెగిటివ్ షేడ్ లో చాలా పవర్ ఫుల్ నటనను కనబరిచారని చెప్పాలి. తన లుక్ గెటప్ కంప్లీట్ డిఫరెంట్ గా కనిపించి బోయపాటి సినిమాల్లో విలన్ ఏ రేంజ్ లో ఉంటాడో ఆ ఎమోషన్స్ అన్నీ పలికించి సెటిల్డ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. అలాగే బాలయ్యకి తనకి మధ్య సన్నివేశాలు అయితే ఆడియెన్స్ కి పెద్దలకి మంచి ట్రీట్ ఇచ్చేలా అనిపిస్తాయి.
ఇంకా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కి కూడా బాలయ్య సరసన మంచి స్పేస్ దక్కింది. తన లుక్స్ కానీ గ్లామ్ షో కానీ సినిమాలో బాగున్నాయి. అలానే బాలయ్యతో తన కెమిస్ట్రీ బాగుంది. ముఖ్యంగా సాంగ్స్ లో ఇద్దరి జోడి బాగుంది. వీరితో పాటుగా జగపతిబాబు, పూర్ణ తదితరులు తమ స్పెషల్ పాత్రల్లో పరిధి మేరకు ఆకట్టుకున్నారు. అలాగే మరో బిగ్ ప్లస్ సినిమాలో థమన్ మ్యూజిక్ అని చెప్పాలి. ప్రతి ఎలివేషన్ సీన్ లో కూడా తన అవుట్ స్టాండింగ్ వర్క్ తో అలా లేపుతూ సినిమాకి బాగా ప్లస్ అయ్యాడు.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో ఆయా పాత్రల తాలూకా ప్రాముఖ్యత వాటి ప్రెజెంటేషన్ అయితే బాగుంది కానీ కథలో మాత్రం ఎలాంటి కొత్తదనం కనిపించదు. అలాగే నిడివి కూడా కాస్త ఎక్కువగానే ఉన్న భావన సినిమా చూసేవారికి కలుగక మానదు. సినిమా ఫ్లో లో క్లైమాక్స్ కి వచ్చే సరికి కూడా అంత చెప్పుకోదగ్గ ట్విస్టులు కూడా కనిపించవు.
బోయపాటి సినిమాల్లో లాజిక్స్ కోసం ఎలాగో వెతకకూడదు అని తెలిసిందే. ఒక మాస్ ఫ్లో లోనే సినిమా వెళుతుంది కానీ లాజికల్ గా కొన్ని కనెక్షన్స్ మిస్సవుతాయి. ఇంకా ముఖ్యంగా అయితే అఖండ లాంటి పవర్ ఫుల్ పాత్ర సెకండాఫ్ లో ఎంటర్ అయ్యాక దానికి తగ్గ సరైన ప్రతిపక్ష పాత్ర మిస్సయినట్టు క్లియర్ గా అనిపిస్తుంది.
కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కాస్త ఇరికించినట్టు అనిపిస్తుంది. దీనితో అక్కడక్కడా కథనం నెమ్మదించడం గమనించవచ్చు. యాక్షన్ సీక్వెన్స్ లు కూడా కాస్త ఎక్కువే ఉన్నాయి వాటి మోతాదు కొంచెం తగ్గించి ఉంటే బాగుండు.
సాంకేతిక విభాగం :
ఈ చిత్రంలో బాలయ్య కెరీర్ లోనే అధిక బడ్జెట్ తో తెరకెక్కించిన మరో సినిమా. ద్వారకా క్రియేషన్స్ వారి నిర్మాణ విలువలు ఈ చిత్రంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఉన్నట్టు కనిపిస్తాయి. భారీ సెట్టింగ్స్ కానీ విజువల్స్ లో కానీ వారి రాజీ పడని తీరు కనిపిస్తుంది.
ఇక టెక్నికల్ టీం వర్క్ లోకి వస్తే మొదటగా సంగీత దర్శకుడు థమన్ కోసం చెప్పాలి. తాను ఇచ్చిన సాంగ్స్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలో మరింత ప్లస్ అయ్యింది. అలాగే రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ మంచి విజువల్స్ ని చూపించింది.
ఇక దర్శకుడు బోయపాటి విషయానికి వస్తే తన హీరోని ప్రెజెంట్ చేసే విధానంలో బోయపాటి స్టైల్ సెపరేట్ గా ఉంటుంది. ఇక అది బాలయ్య విషయంలో అయితే ఏ లెవెల్లో ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ ఈ సినిమాకి మాత్రం మళ్ళీ రెండు కొత్త వేరియేషన్స్ లో బాలయ్యని సరికొత్తగా ప్రెజెంట్ చేసి బోయపాటి డెఫినెట్ ట్రీట్ ఇచ్చారు.
అలాగే శ్రీకాంత్ ఇతర నటులకి కూడా మంచి పాత్రలు ఇచ్చిన బోయపాటి కొన్ని చోట్ల కథనంలో నెమ్మదించారు. కథ కూడా రొటీన్ గానే అనిపిస్తుంది. కానీ మాస్ ఆడియెన్స్ కానీ బాలయ్య అభిమానులను కానీ నిరాశపరిచే అంశం ఒకటి కూడా పెట్టకుండా జాగ్రత్త తీసుకున్నారు.
తీర్పు :
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే చాలా కాలం తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గరకి వచ్చిన ఈ బిగ్ రిలీజ్ “అఖండ”. ఆ హైప్ ని నిలుపుకుంటుందని చెప్పొచ్చు. బాలయ్య – బోయపాటి కాంబోపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే వీరి నుంచి ఎక్కడా తగ్గని ట్రీట్ కనిపిస్తుంది. కావాల్సినన్ని యాక్షన్ ఎలిమెంట్స్ డీసెంట్ ఎమోషన్స్ మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా బాలయ్య రెండు అవతార్స్ లో పెర్ఫామెన్స్ కట్టిపడేస్తుంది. కాకపోతే అక్కడక్కడా ల్యాగ్స్, కథలో పెద్దగా కొత్తదనం లేని కథని, నిడివి ముఖ్యంగా సెకండాఫ్ లో వైలెన్స్ ఎక్కువ కావడం క్లాస్ ఆడియెన్స్ కి అంతగా రుచించదు. ఇవి పక్కన పెడితే అఖండ ఈ వారాంతానికి మాస్ ఆడియెన్స్ కి ఈ చిత్రం మంచి ట్రీట్ ఇస్తుంది.
123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team