సమీక్ష : అక్షర – కథాంశం బాగున్నా కథనం ఆకట్టుకోదు !

సమీక్ష : అక్షర – కథాంశం బాగున్నా కథనం ఆకట్టుకోదు !

Published on Feb 27, 2021 6:59 AM IST
Naandhi movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 26, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : నందిత శ్వేత, సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్

దర్శకత్వం : బి. చిన్నికృష్ణ

నిర్మాత‌లు : సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ

సంగీతం : సురేష్ బొబ్బిలి

సినిమాటోగ్రఫీ : నగేష్ బెనల్

ఎడిటింగ్ : జి.సత్య

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నందిత శ్వేత అక్కడ నుంచి మంచి రోల్స్ లోనే కనిపించింది. మరి ఇప్పుడు తాను కీలక పాత్రలో నటించిన “అక్షర” అనే సోషల్ డ్రామా డీసెంట్ బజ్ తో విడుదల అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం.

 

కథ:

 

అక్షర(నందిత శ్వేత) ఓ ప్రముఖ విద్యావేత్త అయినటువంటి సంజయ్(సంజయ్ స్వరూప్) విద్యా విధాన్ లో లెక్చరర్ గా జాయిన్ అవుతుంది. అయితే అదే కాలేజ్ లో తన సహా మేల్ లెక్చరర్ ఆ కాలేజ్ బోర్డ్ సభ్యుడు శ్రీ తేజ(శ్రీ తేజ) తో మంచి పరిచయం ఏర్పడుతుంది. అలా కొన్నాళ్ళకు శ్రీతేజ ఆమెకు ప్రపోజ్ చెయ్యాలని అనుకుంటాడు కానీ కొన్ని ఊహించని పరిణామాల రీత్యా ఆమె అతడిని చంపేస్తుంది. అసలు ఆమె అతడిని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఆమె వెనుక ఉన్న కథ ఏంటి? ఆ కాలేజ్ కు ఆమెకు ముందే ఏమన్నా సంబంధం ఉందా అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

నటిగా ఇప్పటి వరకు తెలుగులో చేసిన పలు సినిమాల ద్వారా తనలోని బెస్ట్ ను నందిత శ్వేత ఇప్పటి వరకు చూపించింది. మరి ఈ చిత్రంలో కూడా సినిమా అంతా ఆమెపైనే తిరడం మూలాన తన నటనను చూపేందుకు ఇంకా స్కోప్ వచ్చింది. దీనికి అనుగుణంగా ఈమె చాలా బాగా నటించింది. మంచి ఎమోషన్స్ కొన్ని కీలక సన్నివేశాల్లో ఆమె నటనలో పరిణితి చాలా బాగా కనిపిస్తుంది.

అలాగే ఈ చిత్రంలో విద్యకు సంబంధించి చూపిన లైన్ కార్పొరేట్ సంస్థలు విద్యా వ్యవస్థను ఎలా భ్రష్టు పట్టించారు అన్నవి ఎమోషనల్ కోణంలో చూపిన విధానం ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. వీటితో పాటుగా సెకండాఫ్ లో కూడా మంచి నరేషన్ కనిపిస్తుంది. ఎమోషన్స్ ను హ్యాండిల్ చేస్తూ డీసెంట్ గా అనిపిస్తుంది. అలాగే మరో నటుడు హర్ష వర్ధన్ మరో మంచి రోల్ లో కనిపిస్తారు. మిగతా నటీనటులు శ్రీ తేజ, స్వరూప్, శత్రు తదితరులు మంచి నటనను కనబరిచారు.

 

మైనస్ పాయింట్స్:

 

ఇక ఇందులో మైనస్ పాయింట్స్ కు వస్తే ఒక్క ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ మినహాయిస్తే ఫస్ట్ హాఫ్ మొత్తంలో పెద్దగా చెప్పుకోడానికి ఏమి ఉండదు. కొన్ని అనవసరపు సన్నివేశాలు, ఆకట్టుకోని కామెడీ అంతలా ఎలివేట్ కావు.

అలాగే సినిమాలో షకలక శంకర్, సత్య మరియు మధు లాంటి వారిని పెట్టుకున్నా వారిపై సీన్స్ జస్ట్ పెట్టాలి అన్నట్టుగా అనిపిస్తాయి తప్పితే సినిమాకు అంతగా ఉపయోగకరంగా అనిపించవు.

అలాగే ఓ పోలీస్ కమిషనర్ ను పబ్లిక్ ప్లేస్ లోనే చంపెయ్యడం లో లాజిక్ ఏంటో దానిని ఎందుకు ఎలా పెట్టారో సరైన వివరణ ఎక్కడా కనిపించదు. ఇంకా కొన్ని అనవసర సన్నివేశాలను కూడా తగ్గించాల్సింది.

 

సాంకేతిక వర్గం:

 

ఈ లిమిటెడ్ బడ్జెట్ సినిమాలో నిర్మాణ విలువలు డీసెంట్ గా అనిపిస్తాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాల్లో మరియు సెకండాఫ్ లో చాలా బాగుంటుంది, సినిమాటోగ్రఫీ కూడా నీట్ గా ఉంది. అయితే ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగున్ను.

ఇక దర్శకుడు చిన్ని కృష్ణ విషయానికి వస్తే తాను ప్రస్తుతం విద్యా రంగంపై కీలక అంశాన్ని తీసుకున్నారు. దానిని కాస్త సినిమాటిక్ అంశాలను జోడించడంలో తడబడ్డారు తప్పితే తాను అనుకున్న సోషల్ పాయింట్ ను మాత్రం చాలా కన్వీనెంట్ గా చూపించారు. కొన్ని ఎంటర్టైనింగ్ సీన్స్ ను బాగా రాసుకుంటే బాగుండేది కానీ తాను చెప్పదలుచుకున్న పాయింట్ ను మాత్రం చక్కగా హ్యాండిల్ చేశారు.

 

తీర్పు:

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే “అక్షర” ప్రస్తుత విద్యా విధానం అలాగే ఆ విద్యా సంస్థలను ఉద్దేశించి తీసిన సోషల్ డ్రామా. నందిత శ్వేతా ప్రామిసింగ్ నటన, ఎమోషన్స్ అలాగే దర్శకుడు చెప్పిన సందేశం నీట్ గా అనిపిస్తాయి. కాకపోతే బాగా బోర్ గా అనిపించే ఫస్ట్ హాఫ్, కొన్ని అనవసర సన్నివేశాలను మినహాయిస్తే ఈ చిత్రం చూడదగినదే.

123telugu.com Rating :  2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు