సమీక్ష : అలిపిరికి అల్లంత దూరంలో – స్లోగా సాగే రాబరీ డ్రామా!

సమీక్ష : అలిపిరికి అల్లంత దూరంలో – స్లోగా సాగే రాబరీ డ్రామా!

Published on Nov 19, 2022 3:02 AM IST
Alipiriki Allantha Dooramlo Movie-Review-In-Telugu

విడుదల తేదీ : నవంబర్ 18, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: ఎన్ రావణ్ రెడ్డి, శ్రీ నికిత, అలంకృత షా, రవీందర్ బొమ్మకంటి, ప్రసాద్ బెహరా, ఎం.ఎస్, లహరి గుడివాడ, అమృతవర్షిణి సోమిశెట్టి

దర్శకుడు : ఆనంద్ జె

నిర్మాతలు: రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి

సంగీత దర్శకుడు: ఫణి కళ్యాణ్

సినిమాటోగ్రఫీ: డి.జి.కె

ఎడిటర్: సత్య గిడుతూరి

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

యువ నటుడు రావణ్ నిట్టూరు కధానాయకుడిగా కాస్కేడ్ పిక్చర్స్ బ్యానర్ పై రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మించిన చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా పై ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

వారధి (రావణ్ నిట్టూరు) తిరుమల లో షాప్ పెట్టుకుని లైఫ్ లో సెటిల్ కావాలని ఆశ పడుతుంటాడు. అలాగే ప్రేమించిన అమ్మాయి కీర్తిని (శ్రీ నికిత) పెళ్లి చేసుకోవాలని కలలు కంటాడు. అయితే, వారధి ఫ్యామిలీ ఆర్థికంగా వెనుకబడి ఉంటుంది. అంతలో వారధి జీవితంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల కారణంగా రెండు కోట్లు డబ్బు రాబరీ చేస్తాడు. ఆ తర్వాత వారధి జీవితం ఎలా మలుపు తిరిగింది?, చివరకు వారధి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాడు?, అలాగే ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన రావణ్ నిట్టూరు పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన ఎమోషనల్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి ‘అలిపిరికి అల్లంత దూరంలో’ సినిమా కొన్ని చోట్ల ఆకట్టుకుంది. ముఖ్యంగా కామెడీ టోన్ తో సాగే రాబరీ సీన్ అండ్ మిగిలిన సీక్వెన్స్ లు అండ్ ఎమోషన్స్ వంటివి సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన రావణ్ నిట్టూరు తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. తన లుక్స్ అండ్ ఫిజిక్ బాగా మెయింటైన్ చేశాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు.

అలాగే, హీరోయిన్ పాత్రలో నటించిన శ్రీ నికిత కూడా చాలా బాగా నటించింది. ఆమె హావ భావాలు కూడా బాగానే అలరించాయి. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సస్పెన్స్ ఎమోషనల్ రాబరీ డ్రామా లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు ఆనంద్ బాగా తీశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రివీల్ అయ్యే కంటెంట్ తో బాగా ఆకట్టుకున్నాడు.

 

మైనస్ పాయింట్స్ :

 

కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా పూర్తి సస్పెన్స్ పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగతీయడంతో కొన్ని సీన్స్ కనెక్ట్ కావు. అయితే దర్శకుడు ఆనంద్ పనితనం సినిమా పై ఆసక్తిని కలిగించినప్పటికీ… అదే విధంగా ఆయన రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు మరియు క్లైమాక్స్ సీన్స్ బాగున్నప్పటికీ.. కొన్ని చోట్ల కథనం ఆశించిన స్థాయిలో సాగదు.

ఇక కొన్ని సీన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వవు. దర్శకుడు సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత అనవసరమైన సీన్స్ కారణంగా కథ డైవర్ట్ అయింది. మొత్తానికి ఈ ఎమోషనల్ రాబరీ స్టోరీలో కొన్ని కామెడీ సీన్స్, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. ఓవరాల్ గా అవసరానికి మించిన స్లో సన్నివేశాలు లేకుండా ఉంటే బాగుండేది.

 

సాంకేతిక విభాగం :

 

సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు సమకూర్చిన పాటలు బాగున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నా .. కెమెరామెన్ మాత్రం వాటిని తెరకెక్కించిన విధానం బాగాలేదు. ఎడిటింగ్ కూడా బాగాలేదు. ఈ చిత్ర నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు బాగాలేదు.

 

తీర్పు:

 

‘అలిపిరికి అల్లంత దూరంలో’ అంటూ వచ్చిన ఈ రాబరీ ఎమోషనల్ సస్పెన్స్ డ్రామాలో కొన్ని సీన్స్ ఆకట్టుకున్నాయి. అలాగే, కథలోని కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మరియు కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ముఖ్యంగా క్లైమాక్స్ బాగున్నాయి. కానీ, ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ స్లోగా సాగడం, అలాగే కొన్నిచోట్ల ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు