ఒటిటి సమీక్ష : అమ్ము- అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్

Ammu Movie Review

విడుదల తేదీ : అక్టోబర్ 19, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: ఐశ్వర్య లక్ష్మి, నవీన్ చంద్ర, బాబీ సింహా, రఘు బాబు, సత్య, మాల పార్వతి, ప్రేమ్ సాగర్

దర్శకత్వం : చారుకేష్ శేఖర్

నిర్మాతలు: కార్తికేయన్ సంతానం, కల్యాణ సుబ్రమణియన్, కార్తీక్ సుబ్బరాజ్

సినిమాటోగ్రఫీ: అపూర్వ శాలిగ్రామ్

ఎడిటర్స్ : రాధా శ్రీధర్

సంబంధిత లింకులు : ట్రైలర్

అమెజాన్ ప్రైమ్ వారు స్వయంగా రిలీజ్ చేసిన ఒరిజినల్ మూవీ అమ్ము. ఐశ్వర్య లక్ష్మి, నవీన్ చంద్ర, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మొదటి నుండి అందరిలో మంచి ఆసక్తిని రేపింది. మరి నేడు మంచి అంచనాలతో అమెజాన్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం

 

కథ :

అమ్ము (ఐశ్వర్య లక్ష్మి) రవీంద్రనాథ్ (నవీన్ చంద్ర) అనే పోలీస్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకుంటుంది. ఇక పెళ్లైన దగ్గరి నుండి అమ్ముని రవీంద్రనాథ్ ఎంతో మానసికంగా శారీరకంగా హింసలు పెడుతుండడంతో ఆమె ఎంతో భరిస్తూ లైఫ్ కొనసాగిస్తుంది. అయితే ఒకానొక సందర్భంలో ఆమెకు ప్రభు (బాబీ సింహా) అనే క్రిమినల్ ని కలిసిన అనంతరం ఒక ప్లాన్ ప్రకారం భర్త రవీంద్రనాథ్ ని అంతమొందించాలని భావిస్తుంది. మరి ఇంతకీ వారిద్దరి ప్లాన్ ఏంటి, అనంతరం ఏమి జరిగింది, మరి అమ్ము, రవీంద్రనాథ్ అడ్డు తొలగించుకుందా లేదా అనేది మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

నిజానికి ఈ మూవీ కోసం ప్రస్తుతం మన సమాజంలో మెజారిటీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యని తీసుకున్న దర్శకుడు చారుకేష్ శేఖర్ కథని ఆకట్టుకునేలా ముందుకు నడిపారు. ఇక అమ్ము పాత్రలో తన సహజ నటనతో ఐశ్వర్య లక్ష్మి ఎంతో బాగా పెర్ఫార్మ్ చేసారు. ముఖ్యంగా భర్త పెట్టె అనేక బాధలను అతడి చిత్రహింసలను సహిస్తూ జీవించే పాత్రలో ఆమె ఒదిగిపోయారు. నవీన్ చంద్ర కూడా ఇగోయిస్టిక్, శాడిస్టిక్ భర్త పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. మొదటి నుండి ప్రతి సినిమాతో నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న నవీన్ చంద్ర మరొక్కసారి ఆడియన్స్ ని అలరించారు. ఇక బాబీ సింహా పాత్ర కూడా సినిమాలో కీలకం కావడం, ఆయన కూడా ప్రభు పాత్రని సూపర్బ్ గా పెర్ఫార్మ్ చేయడం జరిగింది. అమ్ము మూవీకి ముఖ్యంగా పద్మావతి మల్లాది రాసిన అద్భుతమైన కొన్ని డైలాగ్స్ ఎంతో బాగున్నాయి. సత్య, ప్రేమ్ సాగర్, రఘుబాబు తదితర ఇతర నటులు కూడా తమ పాత్రల యొక్క పరిధి మేరకు చక్కగా నటించి ఆకట్టుకున్నారు. అలానే ఈ మూవీ కోసం దర్శకుడు ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ కూడా బాగుంటుంది.

 

మైనస్ పాయింట్స్ :

మూవీకి సంబంధించి ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉన్నప్పటికీ అక్కడక్కడా మధ్యలో కొంత ల్యాగ్ సీన్స్ మూవీ యొక్క టెంపోని ఇబ్బంది పెడతాయి. సినిమాలో వచ్చే రిపీటెడ్ సన్నివేశాలను కొంత కత్తిరించి ఉంటె బాగుండేది. ఇక బాబీ సింహా పాత్ర కోసం వచ్చే ఎమోషనల్ సీన్స్ మనసుని కదిలిస్తాయి, ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటాయి. సినిమాలో కథ, కథనాలు ముందే మనకు అర్ధం అయినప్పటికీ హీరోయిన్ ని రక్షించేందుకు కనిపించే బాబీ సింహా పాత్ర ద్వారా నడిచే కథనం బాగుంది. ఇక మిగతా కథ అంతా పర్వాలేదనిపించేలా సాగుతుంధి.

 

సాంకేతిక విభాగం :

ముఖ్యంగా ఈ సినిమా దర్శకుడు చారుకేష్ శేఖర్ మూవీని ఎంతో బాగా నడిపించారు, స్క్రీన్ ప్లే పరంగా అమ్ము మూవీ ఆడియన్స్ ని అలరిస్తుంది. పద్మావతి మల్లాది గారి డైలాగ్స్ సినిమా కి మరింత ఆకర్షణగా నిలిచి కొన్ని సన్నివేశాల్లో మనల్ని ఆలోచింపచేస్తాయి. ఇక మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ కూడా ఎంతో బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నప్పటికీ ఎడిటింగ్ విషయంలో మాత్రం టీమ్ మరింత శ్రద్ధ తీసుకుని కొన్ని సాగతీత, రిపీటెడ్ సన్నివేశాలు కట్ చేస్తే బాగుండేది. మిగతా అన్ని విభాగాలు ఎంతో చక్కగా పని చేసాయి.

 

తీర్పు :

నేటి సమాజంలో స్త్రీల పై జరిగే గృహ హింస ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ మూవీని దర్శకుడు చారుకేష్ శేఖర్ ఆడియన్స్ నాడి పెట్టుకునేలా తెరకెక్కించారు. హీరో నవీన్ చంద్ర, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ల అద్భుత నటన ఈ మూవీకి మరొక బలం. అయితే ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా కొన్ని ల్యాగ్ సీన్స్, నార్మల్ గా సాగె కథనం కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ ఓవరాల్ గా అమ్ము మూవీని తప్పకుండా అమెజాన్ ప్రైమ్ ని ట్యూన్ చేసి చక్కగా చూడవచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version