ఓటీటీ రివ్యూ : ‘అనగనగా ఓ అతిథి’ – స్లోగా సాగే ఎమోషనల్ డ్రామా !

ఓటీటీ రివ్యూ : ‘అనగనగా ఓ అతిథి’ – స్లోగా సాగే ఎమోషనల్ డ్రామా !

Published on Nov 21, 2020 3:03 AM IST
Anaganaga O Athidhi Telugu Movie Review

విడుదల తేదీ : నవంబర్ 20th,2020

123telugu.com Rating : 2.5/5

నటీనటులు : పాయల్ రాజ్‌పుత్, చైతన్య కృష్ణ తదితరులు

దర్శకత్వం : దయాల్‌ పద్మనాభన్‌

రచన : దయాల్‌ పద్మనాభన్‌

మ్యూజిక్ : అరోల్ కొరెల్లి

సినిమాటోగ్రఫీ : రాకేష్ బి.

 

 

 

పాయల్ రాజ్‌పుత్, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘అనగనగా ఓ అతిథి’. కన్నడ చిత్ర పరిశ్రమలో అవార్డ్ విన్నింగ్‌ మూవీస్‌ని తెరకెక్కించిన దర్శకుడు దయాల్‌ పద్మనాభన్‌ తెలుగులో డైరెక్ట్‌ చేస్తున్న తొలి చిత్రమిది. అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో నవంబర్ 20న ఈ చిత్రం విడుదలవుతోంది. థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ సినిమాని ముందుగానే ప్రివ్యూ వేయడం జరిగింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

మల్లిక (పాయల్ రాజ్ పుత్) కుటుంబ పేద‌రికంతో బాధ‌ప‌డుతుంటుంది. వారి కష్టాల‌ను దాట‌డానికి జోతిష్యుడు చెప్పిన జాత‌కం, వారి జీవితంలోకి వచ్చిన అతిథి శ్రీనివాస్ (చైతన్య కృష్ణ) వ‌ల్ల వారికి ఎదురైన పరిస్థితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. దురాశ, మోహం, అత్యాశ వంటి అంశాలను సూచించేలా సాగిన ఈ పాత్రలు చివరకు ఎలా ముగిశాయి ? ఇంతకీ శ్రీనివాస్ కి పాయల్ కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రధాన పాత్ర మల్లిక పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి ‘అనగనగా ఓ అతిథి’ సినిమా వైవిధ్యంగానే సాగింది. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే సస్పెన్స్ సీన్స్ అండ్ ట్విస్ట్ లు అండ్ ఎమోషన్స్ వంటివి సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. మెయిన్ గా డబ్బు మీద ఆశతో చైతన్య పాత్రతో సాగే సన్నివేశాల్లో ఆమె నటన.. అలాగే తన పేద జీవితం పట్ల ఆమె పలికించిన నిరాశ హావభావాలు చాలా బాగున్నాయి.

న్యూ యాంగిల్ లో హీరోయిన్ పాయింట్ అఫ్ వ్యూలో దయాల్‌ పద్మనాభన్‌ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ను తీసుకొవడం… దాన్ని స్క్రీన్ మీద ఇంట్రస్టింగ్ గా మలచడం అంటే మాటలు కాదు. కానీ దయాల్‌ పద్మనాభన్‌ మంచి దర్శకత్వ పనితనం కనబరిచారు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నమైన చిత్రంగా ఈ సినిమాని మలిచారు. డబ్బు పై ఆశతో జీవితాన్ని నాశనం చేసుకున్నే ప్ర‌తి ఒక్కరికీ ఈ మూవీ కాన్సెప్ట్ క‌నెక్ట్ అవుతుంది. ఇక హీరోగా నటించిన చైతన్య కూడా బాగానే నటించాడు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చెయ్యకుండా పూర్తి సస్పెన్స్ పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు పాయల్ క్యారెక్టర్ కి ఇచ్చిన ఓవర్ బిల్డప్.. దానికి తగ్గట్లుగానే పాయల్ ఇచ్చిన సీరియస్ లుక్స్.. చివరికి క్లైమాక్స్ లో మెయిన్ ట్విస్ట్ ను రివీల్ చేసినప్పుడు పై వాటికి ఎక్కడా పొంతన లేకపోవడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి.

అయితే దర్శకుడు దరకత్వ పనితనం సినిమా పై ఆసక్తిని కలిగించినప్పటీ… అదే విధంగా ఆయన రాసుకున్న కాన్సెప్ట్, ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు మరియ క్లైమాక్స్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ స్లోగా సాగుతూ ఉండటంతో.. కమర్షియల్ చిత్రాలకు మాత్రమే కట్టుపడ్డ రెగ్యులర్ సినిమాల మైండ్ సెట్ ఉన్న ఆడియన్స్ కు ఈ సినిమా పూర్తిగా కనెక్ట్ కాకపోవచ్చు. దానికి తోడూ మొదటి భాగం కథనంలో ప్లో అర్ధం కాకుండా ఉండడంతో కొన్ని చోట్ల బోర్ కొడుతోంది.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. దర్శకుడు దయాల్‌ పద్మనాభన్‌ షాట్ మేకింగ్ అండ్ ఆయన విజన్ చాలా బాగుంది. ఇక సినిమా క్వాలిటీ పరంగా చూసుకుంటే కచ్చితంగా ఆయన టాలెంట్ ను మెచ్చుకోవాలి. బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ.. సినిమా విజువల్ గా పూర్తిగా ఆకట్టుకునేలా ఆయన సినిమాని తెరకెక్కించారు. కెమెరామెన్ రాకేష్ బి. కెమెరా పనితనం కొన్ని కీలక సన్నివేశాలల్లో చాలా బాగుంది. సినిమాకు అతని కెమెరా కన్ను పెద్ద ప్లస్ అయింది. సంగీత దర్శకుడు అరోల్ కొరెల్లి అందించిన సంగీతం పర్వాలేదు. అయితే సీన్ మూడ్ తో పాటు ఓవరాల్ సినిమాని దృష్టిలో పెట్టుకుని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ఉంటే బాగుండేది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయిని తగ్గించినా.. ఎక్కడా ఆ ఫీల్ కలగదు.

 

తీర్పు :

వైవిధ్యమైన కంటెంట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ థీమ్ మరియు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. అయితే, ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బోర్ గా సాగడం, కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం లాంటివి సినిమాకి డ్రా బ్యాగ్స్ గా అనిపిస్తాయి. కానీ, దయాల్‌ పద్మనాభన్‌ డైరెక్షన్ అండ్ ఆయన చేసిన సిన్సియర్ అటెంప్ట్ ఆకట్టుకుంటాయి. మొత్తం మీద ఈ ‘చిత్రం’ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు నచ్చుతుంది. అయితే ముందు చెప్పుకున్నట్లు.. కమర్షియల్ చిత్రాలకు మాత్రమే కట్టుపడ్డ రెగ్యులర్ సినిమాల మైండ్ సెట్ ఉన్న ఆడియన్స్ ను ఈ సినిమా అస్సలు ఆకట్టుకోదు.

123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు